గాన కోకిల జానకీకి కన్నీటి నివాళులు.. రాజకీయ, సినీ ప్రముఖుల సంతాపం

Must read

ప్రముఖ గాయని, గాన కోకిల ఎస్. జానకి మృతి పలువురు ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జానకీ ఇక లేరన్న వార్త తీవ్రంగా కలచివేసిందన్నారు. తన మధురమైన గళంతో దశాబ్దాల పాటు కోట్లాది మంది సంగీతాభిమానులను అలరించిన జానకి మరణం భారత చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటని బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.

“మా నాన్నగారు, స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి చిత్రాలతో పాటు, నా చిత్రాలలోనూ ఆమె ఎన్నో అమర గీతాలు పాడారు. ఆ పాటలు ఎప్పటికీ ప్రజాదరణ పొందుతూనే ఉంటాయి. మా కుటుంబంతో ఆమెకు దశాబ్దాల అనుబంధం ఉంది” అని బాలకృష్ణ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

మెగాస్టార్​ చీరంజీవి ఎక్స్ వేదికగా జానకి మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తి చేశారు. “తెరపై మేము పండించిన ఎన్నో భావోద్వేగాలకు ఆమె గొంతు ప్రాణం పోసింది. ఆమె ఒక అసాధారణ కళాకారిణి” అని పేర్కొన్నారు. తన సినీ ప్రయాణంలో ఎన్నో మరపురాని గీతాలకు ఆమె తన అపురూపమైన గాత్రాన్ని అందించారని చిరంజీవి గుర్తుచేసుకున్నారు. ఆమె పాడిన ప్రతి పాట ఒక జ్ఞాపకం… ఒక అనుభూతి… ఒక జీవితకాలపు అనుబంధం. నేడు మనం సంగీత ప్రపంచంలోని ఒక మహోన్నత శిఖరాన్ని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.

ఏపీ మంత్రి నార లోకేష్​ గాన కోకిల జానకీ మరణవార్తపై స్పందిస్తూ.. 48 వేలకు పైగా పాటలు పాడి సంగీత ప్రియుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. తన మధురమైన గాత్రంతో దశాబ్దాల పాటు కోట్లాది మందిని అలరించారు” అని లోకేశ్ కొనియాడారు. భారతీయ సినీ సంగీత చరిత్రలో ఆమె స్థానం చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు.

తెలంగాణ సీఎం రేవంత్​ రెడ్డి గానకోకిల మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జానకి గారు తన గాత్రంతో నవరసాలను పలికించేవారని.. తెలుగు గడ్డపై జానకి జన్మించినందుకు గర్వంగా భావిస్తానని ఈ సందర్బంగా ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపారు.

ఏపీ ఉపముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు పవన్​ కళ్యాణ్​ ఎస్​. జానకి మృతి పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు గాయనీమణుల్లో జానకి గారు ఒక ఆణిముత్యం అన్నారు. ‘నిరీక్షణ’, ‘సితార’, ‘స్వాతిముత్యం’, ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’, ‘ప్రతిఘటన’, ‘అంతఃపురం’ వంటి చిత్రాల్లో ఆమె ఆలపించిన అద్భుతమైన గీతాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. “ఆమె గాత్రం ఎంతో మధురమైనది. ఉత్తమ గాయనిగా నాలుగుసార్లు జాతీయ పురస్కారాలు, 10 సార్లు నంది పురస్కారాలను ఆమె అందుకున్నారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!