త్వరితగతిన సూర్యఘర్ కనెక్షన్లు పూర్తి చేయాలి :మంత్రి గొట్టిపాటి రవికుమార్

Must read

ఆంధ్రప్రదేశ్‌లో సౌరశక్తి వినియోగాన్ని విస్తృతంగా పెంచేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్య గహన్​ యోగజన పథకం అమలును వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్​ విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కేటాయించిన 6 లక్షల సూర్యఘర్ కనెక్షన్లను రానున్న 100 రోజుల్లో పూర్తి చేయాలని మంత్రి స్పష్టం చేశారు. ఈ లక్ష్యం సాధనకు అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్దేశించిన గడువును తప్పక పాటించాలని ఆయన హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా పథకం అమలు ప్రగతి, సాంకేతిక సమస్యలు, కాంట్రాక్టర్ల పనితీరు వంటి అంశాలను సమీక్షించారు.

ఈ భేటీకి పుల్లారెడ్డి కమలాకర్​ బాబులతో పాటు పీఎం సూర్యఘర్ పథకానికి సంబంధించిన కాంట్రాక్టర్లు హాజరయ్యారు. అధికారులు తమ తమ విభాగాల పనితీరును వివరించారు. అమలులో ఎదురవుతున్న సమస్యలను కూడా మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రతి డిస్కం పరిధిలో రోజుకు కనీసం 2 వేల సూర్యఘర్ కనెక్షన్లు పూర్తి చేసేలా కార్యాచరణ ఉండాలని సూచించారు. లక్ష్యాలను చిన్న భాగాలుగా విభజించి, ప్రతి రోజూ పురోగతిని పర్యవేక్షించాలని అన్నారు. పనుల్లో ఎటువంటి ఆలస్యం లేకుండా సమయపాలన పాటించాలని స్పష్టం చేశారు.

సౌరశక్తి వినియోగం పెరగడం ద్వారా విద్యుత్ ఖర్చులు తగ్గడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడుతుందని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకం ద్వారా ప్రజలకు ఆర్థిక లాభాలు చేకూరుతాయని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఈ పథకం ద్వారా మరింత ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

అధికారులు, కాంట్రాక్టర్లు సమన్వయంతో పనిచేసి గడువులోగా లక్ష్యాన్ని పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రతి దశలో నాణ్యతను కాపాడుతూ పనులు జరగాలని, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని మంత్రి అధికారులకు తెలిపారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!