డెల్టా ఎలక్ట్రానిక్స్ ఇండియా ప్రెసిడెంట్ బెంజిమన్ లిన్ తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… విశాఖపట్నంలో డెల్టా ఎలక్ట్రానిక్స్ ఇన్నోవేషన్, ఆర్&డీ సెంటర్ ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ ఫెసిలిటీ “స్మార్ట్ మాన్యుఫాక్చరింగ్” సాఫ్ట్వేర్, డేటా సెంటర్ ఆప్టిమైజేషన్ అల్గారిథమ్‌లు, ఎనర్జీ స్టోరేజ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్‌పై ఫోకస్ చేస్తుంది. రాష్ట్రంలో డేటా సెంటర్ ఆపరేటర్ల ర్యాపిడ్ ఇన్ఫ్లక్స్కు అవసరమైన థర్మల్&పవర్ మేనేజ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరఫరా చేయడానికి, ఏపీలో డెడికేటెడ్ మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీ స్థాపించండి.
బ్యాటరీ ర్యాక్స్, పవర్ కండిషనింగ్ సిస్టమ్స్ (PCS), ఎనర్జీ మేనేజ్మెంట్ సిస్టమ్స్ (EMS)ను కవర్ చేసే ఫుల్లీ ఇంటిగ్రేటెడ్, ఇన్-హౌస్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ (BESS) మాన్యుఫాక్చరింగ్, అసెంబ్లీ ఫెసిలిటీ సెటప్ యూనిట్ ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ కోరారు.
రాష్ట్రంలో డేటా సెంటర్ ఆపరేటర్ల వేగవంతమైన పెరుగుదల దృష్ట్యా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరఫరా సామర్థ్యాన్ని పెంచడం అత్యవసరమని ఆయన స్పష్టం చేశారు. దీనిలో భాగంగా బ్యాటరీ ర్యాక్స్, పవర్ కండిషనింగ్ సిస్టమ్స్ (PCS), ఎనర్జీ మేనేజ్మెంట్ సిస్టమ్స్ (EMS)లను కలిగి ఉన్న ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ (BESS) తయారీ మరియు అసెంబ్లీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు.
డెల్టా ఎలక్ట్రానిక్స్&థర్మల్ సంస్థ.. మేనేజ్మెంట్ సొల్యూషన్స్‌లో గ్లోబల్ లీడర్. వారు ప్రధానంగా నాలుగు వ్యాపార విభాగాల్లో ఆపరేట్ చేస్తారు. పవర్ ఎలక్ట్రానిక్స్, మొబిలిటీ, ఆటోమేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. వారికి ప్రపంచవ్యాప్తంగా 51 ఫ్యాక్టరీలు, 73 R&D సెంటర్లు, 157 సేల్స్ ఆఫీసులు ఉన్నాయి. ఏప్రిల్ 2026 నాటికి వారి మార్కెట్ క్యాపిటల్ $166.97 బిలియన్ గా ఉంది.
డెల్టా ఎలక్ట్రానిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ జూన్ 20, 2008న బెంగళూరులో స్థాపించబడింది. డెల్టా ఎలక్ట్రానిక్స్‌కు రుద్రపూర్ (ఉత్తరాఖండ్), గుర్గావ్ (హర్యాన), కృష్ణగిరి (తమిళనాడు)లో మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీలు ఉన్నాయి, గుర్గావ్, బెంగళూరులో R&D సెంటర్లు ఉన్నాయి. డెల్టా ఎలక్ట్రానిక్స్ సెప్టెంబర్ 2027 నాటికి భారతదేశంలో $500 మిలియన్ పెట్టుబడులు పెట్టాలని చేయాలని ప్లాన్ చేస్తోంది, మాన్యుఫాక్చరింగ్ విస్తరణ, సప్లయర్ ఎకోసిస్టమ్, హౌసింగ్, సస్టైనబిలిటీ ఇనిషియేటివ్‌లపై ప్రధానంగా దృష్టి సారిస్తోంది.





