డీలిమిటేషన్ లో తెలంగాణకు అన్యాయం జరగకుండా చూడాలి :కవిత

Must read

తెలంగాణ ప్రాతినిధ్యాన్ని తగ్గించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే వాటిని తెలంగాణ ప్రజలు సహించబోరని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో కేంద్రం ముందుకు తెచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశాలపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రెండు కీలక అంశాలు దేశ రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశం ఉన్నాయని, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రాతినిధ్యంపై దీని ప్రభావం ఉండొచ్చని ఆమె పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా నియోజకవర్గాల సంఖ్య పెంపు అనే పేరుతో కొన్ని రాష్ట్రాల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతుందనే అనుమానం వ్యక్తం చేస్తూ, తెలంగాణకు అన్యాయం జరిగితే అది సహించబోదని కవిత స్పష్టం చేశారు. ఇప్పటికే జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణ భారత రాష్ట్రాలకు అన్యాయం జరిగేలా డీలిమిటేషన్ ప్రక్రియ ఉంటుందనే అభిప్రాయం చాలా కాలంగా వినిపిస్తోందని, ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకునే ప్రతి అడుగును జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నార వ్యక్తం చేశారు.

మహిళా రిజర్వేషన్ బిల్లు పై స్పందిస్తూ, మహిళల రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచడం అవసరమేనని, కానీ అది అన్ని ప్రాంతాలకు సమానంగా న్యాయం చేసే విధంగా ఉండాలన్నారు. తెలంగాణ మహిళలకు తగిన ప్రాధాన్యం ఇవ్వకుండా, ఇతర రాష్ట్రాలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటే అది అంగీకరించమని హెచ్చరించారు. మహిళా సాధికారత పేరుతో ప్రాంతీయ అసమానతలు పెంచడం సరైన పద్ధతి కాదని ఆమె అభిప్రాయపడ్డారు.

డీలిమిటేషన్ ప్రక్రియలో తెలంగాణకు అన్యాయం జరిగే అవకాశం ఉంటే ప్రజలు రోడ్లపైకి వచ్చి తమ హక్కుల కోసం పోరాడతారని కవిత హెచ్చరించారు. తెలంగాణ సాధన కోసం జరిగిన ఉద్యమాన్ని గుర్తు చేస్తూ, అవసరమైతే మళ్లీ అలాంటి పోరాటాలకు సిద్ధమని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో ఎలాంటి రాజీ ఉండదని, కేంద్రం తీసుకునే నిర్ణయాలు పారదర్శకంగా, సమానత్వంతో ఉండాలని ఆమె డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి ఆమె ఒక స్పష్టమైన సందేశం పంపారు. దేశ సమగ్ర అభివృద్ధి కోసం అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం అవసరమని, ఏ ఒక్క రాష్ట్రానికీ అన్యాయం జరిగేలా విధానాలు ఉండకూడదని ఆమె అన్నారు. ముఖ్యంగా తెలంగాణ వంటి కొత్త రాష్ట్రాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని కవిత సూచించారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!