హ్యుందాయ్ కార్ల ధరలు పెంపు

Must read

దేశీయ ఆటోమొబైల్ రంగంలో ప్రముఖ సంస్థగా నిలిచిన హుండాయి మోటర్​ ఇండియా తమ వాహనాల ధరలను పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని స్పష్టం చేసిన కంపెనీ, పెరిగిన ముడిసరుకుల ఖర్చులు, ఇతర ఉత్పత్తి వ్యయాల కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది.

పెంచిన ధరలు 2026 మే 1 నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి రానున్నాయని, ఈ ధరల పెంపు అన్ని మోడళ్లపై ప్రభావం చూపనుండగా, గరిష్టంగా 1 శాతం వరకు మాత్రమే పెంపు ఉండనుందని కంపెనీ వెల్లడించింది. దీంతో వినియోగదారులపై స్వల్ప భారం పడే అవకాశం ఉందని సంస్థ పేర్కొంది.

ఈ ఏడాదిలో హ్యుందాయ్ వాహనాల ధరలను రెండు సార్లు పెంచడం గమనార్హం. ఇప్పటికే 2026 ప్రారంభంలో ఒకసారి ధరలు పెంచిన కంపెనీ, ఇప్పుడు మరోసారి ధరలను సవరించడం మార్కెట్‌లో చర్చనీయాంశంగా మారింది. అయితే, పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు, సరఫరా గొలుసు సమస్యలు, లాజిస్టిక్స్ వ్యయాల భారాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వివరించింది.

ముడిసరుకుల ధరలు ఇటీవల కాలంలో గణనీయంగా పెరిగాయని. ముఖ్యంగా అల్యూమినియం, ఉక్కు, వంటి కీలక పదార్థాల ధరల పెరుగుదల ఉత్పత్తి వ్యయాలపై ప్రభావం చూపుతోందని కంపెనీ తెలిపింది. దీనికి తోడు రవాణా ఖర్చులు కూడా పెరగడం వల్ల వ్యయం మొత్తం పెరిగినట్లు సంస్థ తెలిపింది.

ఇప్పటివరకు ఈ అదనపు వ్యయాలను వీలైనంత వరకు కంపెనీ స్వయంగా భరించిందని, కానీ పరిస్థితులు మరింత కఠినంగా మారడంతో వినియోగదారులకు కొంత భారం మోపాల్సి వచ్చిందని హ్యుందాయ్ సంస్త స్పష్టం చేసింది. వినియోగదారులను దృష్టిలోఉంచుకుని ఈ పెంపు చాలా పరిమిత స్థాయిలోనే ఉంచినట్లు సంస్థ పేర్కొంది.

హెండాయి అన్ని వాహనాలపై ధరల పెంపు ఒకే విధంగా ఉండదని, వినియోగదారులు ఎంచుకునే మోడల్, వేరియంట్ ఆధారంగా ధరల్లో తేడాలు ఉంటాయని కంపెనీ తెలిపింది. ఈ కారణంగా కొంతమంది వినియోగదారులపై ప్రభావం తక్కువగా ఉండే అవకాశం ఉందని ఆశా భావం వ్యక్తం చేసింది.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!