హైదరాబాదు నగరం తో పాటు, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రజా ప్రభుత్వం తీసుకొచ్చిన Hilt (హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్) తీసుకువచ్చిందని, ఈ పాలసీని ప్రజాస్వామ్య పద్ధతిలో అమలు చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు. శుక్రవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో రెవెన్యూ రిసోర్స్ మొబ లైజేషన్ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం కమిటీ చైర్మన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తో పాటు కమిటీ సభ్యులు, మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావులు పాల్గొన్నారు.
Hilt పాలసీపై సమీక్ష సమావేశంలో ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ప్రతినిధులు సైతం పాల్గొని వారి అభిప్రాయాలు తెలిపారు. యిర్ పొల్యూషన్ ఇండెక్స్ గణనీయంగా పెరిగిపోతున్న తరుణంలో కాలుష్యకారక పరిశ్రమలు అన్నిటిని ORR అవతలికి తరలించాలని కంపల్సరీ చేస్తే అందరూ వెళ్ళిపోతారని కొందరు ఇండస్ట్రియల్ ఎస్టేట్ల ప్రతినిధులు స్వయంగా చెప్పినప్పటికీ, మేం అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని ప్రజాస్వామ్య పద్దతిలో ముందుకు పోతున్నామని డిప్యూటీ సీఎం వివరించారు.
UDL (అన్ డెవలప్డ్ ల్యాండ్) పాలసీ కింద భూములను అభివృద్ధి చేసే కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఇండస్ట్రియల్ పార్కుల ప్రతినిధులు కలిసి అభివృద్ధి చేసుకునే ఆలోచన చేయాలి అన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డు మధ్య ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేస్తే మంచిదని, చైనా తరహాలో ప్రత్యేకంగా పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయాలని ఇండస్ట్రియల్ ఎస్టేట్ ప్రతినిధులు సూచించారు ఈ సూచనలను స్వాగతిస్తున్నాం, పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.
ఎవరిని ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన తమకు లేదని నగరాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడమే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఈ క్యాబినెట్ లక్ష్యం అన్నారు. ఓ.ఆర్.ఆర్ లోపల ఉన్న అన్ని ఇండస్ట్రియల్ అసోసియేషన్ తో కూర్చొని చర్చించి HILT పాలసీ అమలు ను వేగవంతం చేసుకుందాం అని డిప్యూటీ సీఎం సూచించారు.
HILT పాలసీ గైడ్లైన్స్ రూపొందించే ముందు ఇండస్ట్రియల్ ఎస్టేట్ల ప్రతినిధుల ఆలోచనలకు చోటు కల్పించే ప్రయత్నం చేస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు.రాష్ట్రంలో పరిశ్రమలు బాగా నడవాలి, కాలుష్యం ఉండకూడదు HILT పాలసీలో రాష్ట్ర ప్రభుత్వం చాలా ఓపెన్ గా ఉందని కమిటీ సభ్యుడు మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కొత్త ఇండస్ట్రియల్ పాలసీలో కార్మికుల కోసం డార్మెటరీలు తప్పనిసరి చేశామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.




