దీనదయాళ్ రోడ్ పనులు వెంటనే ప్రారంభించాలి – జోనల్ కమిషనర్‌కు మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి వినతి

Must read

వినాయక్ నగర్ డివిజన్ పరిధిలోని దీనదయాళ్ రోడ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి కోరారు. ఈ రోజు ప్రజావాణి కార్యక్రమంలో జోనల్ కమిషనర్ సంచిత గంగ్వార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.దీనదయాళ్ రోడ్ అభివృద్ధి పనులకు బడ్జెట్ కేటాయించినప్పటికీ ఇప్పటివరకు పనులు ప్రారంభం కాకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె తెలిపారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వెంటనే రోడ్డు పనులు ప్రారంభించాలని అధికారులను కోరారు.

అలాగే ఎన్నో రోజులుగా స్థానికులు కోరుతున్న గౌరీశంకర్ అపార్ట్మెంట్స్ నుండి దీనదయాళ్ రోడ్ వరకు ఉన్న ఫుట్‌పాత్ తొలగింపు సమస్యను కూడా జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఫుట్‌పాత్ కారణంగా రోడ్డు ఇరుకుగా మారి వాహనదారులు, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని, తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు.ఈ సమస్యలపై జోనల్ కమిషనర్ సంచిత గంగ్వార్ సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని క్యానం రాజ్యలక్ష్మి తెలిపారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!