ఎప్రీల్​ 8 ఎమోషనల్​ డే :అన్నాలెజినోవా

Must read

ఏపీ ఉపముఖ్యమంత్రి సినీ నటుడు పవన్​ కళ్యాణ్​ కుటుంబంలో ఏప్రిల్ 8 ఒక ప్రత్యేకమైన, భావోద్వేగంతో నిండిన రోజు అని ఆయన భార్య అన్నాలెజినోవా తెలిపారు. ఈ రోజు వారి కుటుంబానికి ఆనందంతో పాటు గతాన్ని గుర్తుచేసే ఒక భావుక క్షణం కూడా ఉందని ఆమె పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నేడు తమ పెద్ద కుమారుడు అకీరా నందన్​ పుట్టినరోజు అని గుర్తు చేసుకున్నారు. అదే సమయంలో, గత ఏడాది మార్క్​ శంకర్​ కి సింగాపూర్​ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయాల పాలయ్యాడని ఆమె తెలిపారు. ఈ రెండు సంఘటనలు ఒకే రోజున జరిగి ఉండటం వల్ల ఏప్రిల్ 8 మా కుటుంబానికి ప్రత్యేకంగా మారిందని పేర్కొన్నారు.

సింగపూర్‌లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదం గురించి ఆమె ఇలా అన్నారు. ఆ రోజు తమ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ప్రమాదంలో చిక్కుకుపోయినప్పుడు తాము తీవ్ర భయానికి గురయ్యామని, ఆ క్షణాలు ఇప్పటికీ మర్చిపోలేమని, ఆ ప్రమాదంలో అతను ప్రాణాలతో బయటపడటం ఒక అద్భుతమని ఆమె భావోద్వేగమయ్యారు.

ఆ సంఘటన తర్వాత అతన పునర్జన్మలో జీవిస్తున్నాడని, ఆ సంఘటనను గుర్తుచేసుకుంటే ఇప్పటికీ గుండెల్లో భయం కలుగుతుందని, కానీ అదే సమయంలో దేవుని కృపతో అతను క్షేమంగా ఉండటం పట్ల ఎంతో ఆనందంగా ఉందని ఆమె సంతోషాన్ని వ్యక్త పరిచింది.

మరోవైపు, అకీరా నందన్ పుట్టినరోజు కూడా ఇదే రోజున కావడం తమ కుటుంబానికి ఆనందాన్ని తెచ్చిపెడుతుందన్నారు. అకీరా ఎదుగుతున్న తీరు, అతని ఆలోచనా విధానం తమకు ఎంతో గర్వకారణమన్నారు. ప్రతి విషయాన్ని లోతుగా అర్థం చేసుకోవాలనే ఆసక్తి అతనిలో ఉందని, కొత్త విషయాలను నేర్చుకోవడంలో అకీరా ఎప్పుడూ ముందుంటాడని ఆమె ప్రశంసించారు.

ఈరోజు ఇద్దరు కుమారుల కోసం ప్రత్యేకంగా వేడుకలు నిర్వహించనున్నట్లు అన్నా లెజినోవా తెలిపారు. ఒకవైపు అకీరా పుట్టినరోజు సంబరాలు జరుపుకుంటూ, మరోవైపు మార్క్ శంకర్ జీవితాన్ని సంబరంగా గుర్తుచేసుకుంటామని చెప్పారు. ఈ రోజు తమ కుటుంబానికి ఆనందం, కృతజ్ఞత, భావోద్వేగం అన్నీ కలిసిన ఒక ప్రత్యేక దినంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఎప్రీల్​ 8 ఓ ఎమోషనల్​ డే అని ఆమె తెలిపారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!