విద్యతోనే బీసీల అభ్యున్నతి: మంత్రి సవిత

Must read

విద్యతోనే వెనుకబడిన వర్గాల అభ్యున్నతి సాధ్యమని, సమాజంలో బీసీ బాలికలకు నాణ్యమైన విద్య అందించాలన్న ఫూలే దంపతుల సంకల్పానికి ఎంజేపీ గురుకుల కళాశాల నిదర్శనమని జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత పేర్కొన్నారు. గురువారం సాయంత్రం మైదుకూరు నియోజకవర్గం లోని ఒనిపెంటలో మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల ఆవరణ లో జూనియర్ కళాశాల (బాలికలు) ను జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి,ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ తో కలిసి జిల్లా ఇన్‌చార్జి మంత్రి సవిత ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మహాత్మా జ్యోతిబా ఫూలే, సావిత్రి బాయి ఫూలే ఆశయాలను నేటి ప్రభుత్వం కార్య రూపంలోకి తీసుకువస్తోందన్నారు. సమాజం లోని వెనుకబడిన వర్గాల బాలికలకు నాణ్యమైన విద్య అందించాలన్న ఫూలే దంపతుల సంకల్పానికి ఈ గురుకుల కళాశాల నిదర్శనమనన్నారు. ఒనిపెంటలోని మహాత్మా జ్యోతిభా పూలే గురుకులంలో జరిగింది.

ఒక విద్యాసంస్థ ప్రారంభం మాత్రమే కాదని, పేద, వెనుకబడిన వర్గాల బాలికల బంగారు భవిష్యత్తు కు వేసిన బలమైన పునాదని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన ప్రతి విద్యార్థిని పెద్ద కలలు కనాలి. కలెక్టర్, డాక్టర్, ఇంజనీర్, శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. అందుకు అవసరమైన విద్యా వాతావరణాన్ని ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు ఏమాత్రం తీసిపోని విధంగా డిజిటల్ తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్‌లు,సైన్స్ ప్రయోగశాలలు,లైబ్రరీలు, క్రీడా సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు.

విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందని పేర్కొన్న మంత్రి, జేఈఈ,నీట్,క్లాట్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు వెల్లడించారు. చదువుతో పాటు క్రీడలు ఎంతో ముఖ్యమని, అందుకే ఎంజేపీ స్కూల్ విద్యార్థులకు స్పోర్ట్స్ ట్రాక్ ఇస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే స్పోర్ట్స్ కిట్లు ఇవ్వబోతున్నట్లు తెలిపారు.

కూటమి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీల విద్యకు అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. బీసీ హాస్టళ్లు, గురుకుల్లాల్లో చదవే తమ బిడ్డల పట్ల తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో రూ.500 కోట్లతో ఎంజేపీలకు శాశ్వ భవనాలను నిర్మించనున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి, ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ… నియోజక వర్గంలో బీసీ బాలికల కోసం ప్రత్యేక గురుకుల జూనియర్ కళాశాల ఏర్పాటు కావడం చారిత్రాత్మక ఘట్టమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాల బాలికలకు నాణ్యమైన విద్య అందించేందుకు ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.విద్యార్థినులు కష్టపడి చదివితల్లిదండ్రులకు, సమాజానికి గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షించారు.

అనంతరం మంత్రి సవిత చేతుల మీదుగా విద్యార్థినులకు స్పోర్ట్స్ ట్రాక్ షూట్, యూనిఫాం, పాఠ్యపుస్తకాలు,స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంజేపీ సెక్రటరీ మాధవీలత ప్రిన్సిపాల్ నిర్మల, ఆర్డీవో చంద్రమోహన్, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!