నవమాసాలు మోసి,మన బ్రతుకులకు వెలుగులు చూపించిన..
మన తల్లిదండ్రులను వృద్ధాశ్రమానికి తరలించటం మహాపాపం..
వృద్ధులకు వయసు పెరిగేకొద్దీ జ్ఞాపక శక్తి తగ్గుతుంది..
వారి శరీరం బలహీనం పడిన దృష్టిలోపం వస్తుంది..
వయో భారంతో నడవలేని వృద్ధులను
ఆత్మీయతతో ఆదరించాలి..
అనురాగంతో పలకరించే వాళ్లే అసలైన మహనీయులు..
ప్రేమతో చేరదీసి పట్టెడన్నం పెట్టిన వారే మానవులు..
రేపటి రోజు మన పరిస్థితి దుస్థితి ఏమిటి?..
అనే ఆలోచన ప్రతి ఒక్కరూ తెలుసుకొని, మసులుకోవాలి..
మానవత్వాన్ని చాటి వృద్ధుల పట్ల కరుణచూపాలి..
వృద్ధులను కంటికి రెప్పలా పసిపాపల్లాగా చూసుకోవాలి..
వృద్ధులంటే జీవిత పాఠాలను తిరగేసిన జ్ఞాన జ్యోతులు..
నవ నాడులు పనిచేయక అనుకోలించక నవరంద్రాలు సహకరించక,..
నీరసపడి,అలసి సొలసి కన్నులు బరువైన దైవస్వరూపులు..
జీవితంలో ఆ వృద్ధాప్యం వారికి శాపం కాకూడదు..
మన ఇంటిలో తిరుగాడే దేవతలు ఆ వృద్ధులు..
ఆ వృద్ధ దంపతులు ఆశలు,ఆశయాలు చాలా గొప్పవి..
చిగురించే మహావృక్షం లాంటివి వారి ఆలోచనలు..
ఆ నీడలో వెలుగు బాటలై జీవించాలని కోరుకుందాము..
వృద్ధులకు మనమంతా తోడుగా ఉండి,అండగా నిలుద్దాము..!
ముత్యం వెంకటేశ్వరరావు





