రేపు కోహెడలో పండ్ల మార్కెట్‌కు సీఎం శంకుస్థాపన

Must read

తెలంగాణ వ్యవసాయ మార్కెటింగ్ రంగ చరిత్రలో ఒక కీలక మైలురాయిగా నిలవనున్న కోహెడా అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ నిర్మాణానికి రేపు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన జరగనున్న నేపథ్యంలో శంకుస్థాపన ఏర్పాట్లను రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం ప్రత్యక్షంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రూ.3,367.35 కోట్ల వ్యయంతో 239 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న కోహెడా అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ దేశానికే ఆదర్శంగా నిలిచే విధంగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రూపుదిద్దుకోనున్నదని తెలిపారు. రైతు సంక్షేమం, వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర, ఆధునిక మార్కెటింగ్ సదుపాయాల కల్పనకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. రైతు పండించిన ప్రతి ఉత్పత్తికి మార్కెట్ హామీ కల్పించడం, వ్యవసాయ ఉత్పత్తుల విలువను పెంచడం, రైతుల ఆదాయాన్ని వృద్ధి చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు.

వ్యవసాయ మార్కెటింగ్ రంగాన్ని మరింత బలోపేతం చేయాలనే దూరదృష్టితో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని మంత్రి తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరో రెండు దశాబ్దాల వరకు మార్కెట్ అవసరాలను తీర్చగలిగే విధంగా ఈ మార్కెట్‌ను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.

తెలంగాణలో వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థ ఇప్పటికే దేశంలోనే ఆదర్శవంతమైన వ్యవస్థగా ఎదిగిందని మంత్రి పేర్కొన్నారు. 1962లో ఏర్పాటు చేసిన వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ప్రస్తుతం రాష్ట్రంలో 206 వ్యవసాయ మార్కెట్ కమిటీలు, 79 ఉప మార్కెట్ యార్డులు పనిచేస్తున్నాయని, ప్రతి సంవత్సరం సుమారు రూ.80 వేల కోట్ల విలువైన వ్యవసాయ వాణిజ్య కార్యకలాపాలు ఈ మార్కెట్ల ద్వారా జరుగుతున్నాయని తెలిపారు. రైతుల ప్రయోజనాల పరిరక్షణ, మార్కెట్ల అభివృద్ధి, ధరల సమాచార ప్రచారం, రైతు బజార్ల నిర్వహణ, కనీస మద్దతు ధర కొనుగోళ్లకు అవసరమైన సదుపాయాల కల్పన వంటి కార్యక్రమాలను మార్కెట్ కమిటీలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నాయని చెప్పారు.

హైదరాబాద్ పండ్ల మార్కెట్ అభివృద్ధి ప్రయాణంలో జాంబాగ్, గడ్డిఅన్నారం, బాటసింగారం మార్కెట్లు కీలక పాత్ర పోషించాయని మంత్రి గుర్తు చేశారు. అయితే పండ్ల వ్యాపారం, రవాణా, వినియోగం గణనీయంగా పెరగడంతో ప్రస్తుతం ఉన్న సదుపాయాలు భవిష్యత్ అవసరాలకు సరిపోవని స్పష్టమైందన్నారు. ఈ నేపథ్యంలోనే కోహెడాలో అత్యాధునిక సదుపాయాలతో సమీకృత మార్కెట్ నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!