హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్న క్యానం రాజ్యలక్ష్మి

Must read

హనుమాన్ జయంతి సందర్భంగా వినాయక్ నగర్ డివిజన్ పరిధిలోని లల్వని నగర్ హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు, హోమం, హనుమాన్ చాలీసా పారాయణం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు.ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన హోమంలో ఆమె పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం భక్తులతో కలిసి హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొన్నారు. క్యానం రాజ్యలక్ష్మి మాట్లాడుతూ, ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు గోపాల్, నాగార్జున, యాదగిరి, నరేష్, వెంకటేష్, పోచయ్య, కృష్ణమూర్తి, ఉమాకాంత్, బీజేపీ నాయకులు ఓం ప్రకాష్, సాయి సురేష్, గోపాల్ , స్థానిక ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!