ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయి?

Must read

తెలంగాణ అభివృద్ధి విషయంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ముఖ్యంగా ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. హైదరాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించిన బీజేపీ భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇప్పటివరకు అమలు కాలేదని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో గొప్పలు చెప్పిన నాయకులు ఇప్పుడు ప్రజల ముందుకు రావడం లేదన్నారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులు, యువత కోసం ప్రకటించిన పథకాలు కాగితాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. ప్రజలను అబద్ధపు హామీలతో మభ్యపెట్టడం కాంగ్రెస్ పార్టీకి కొత్త కాదని, గతంలోనూ ఇదే విధానాన్ని అనుసరించిందని వ్యాఖ్యానించారు.

తెలంగాణ అభివృద్ధిలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వ పాత్ర ఎంతో కీలకమని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. గత 11 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం దాదాపు రూ.12 లక్షల కోట్ల నిధులను కేటాయించిందన్నారు. జాతీయ రహదారుల అభివృద్ధి కోసం మాత్రమే రూ.1.85 లక్షల కోట్లు మంజూరు చేశామని తెలిపారు. రాష్ట్రంలో రోడ్ల విస్తరణ, ఎక్స్‌ప్రెస్‌వేలు, ఫ్లైఓవర్లు, జాతీయ రహదారుల నిర్మాణం వంటి పనులు కేంద్ర నిధులతోనే జరుగుతున్నాయని పేర్కొన్నారు.

రైల్వే రంగంలోనూ తెలంగాణకు కేంద్రం పెద్దపీట వేసిందని ఆయన తెలిపారు. రాష్ట్రానికి ఐదు వందేభారత్‌ రైళ్లు కేటాయించామని, 42 రైల్వే స్టేషన్లను ఆధునికీకరిస్తున్నామని వెల్లడించారు. అంతేకాకుండా మూడు బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టులను కూడా తెలంగాణకు అనుసంధానం చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. కేంద్రం చేపడుతున్న ఈ అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం కావాలనే ప్రజలకు తెలియనీయకుండా చేస్తోందని ఆరోపించారు.

రాష్ట్రంలో అమలవుతున్న సన్నబియ్యం పథకానికి కూడా కేంద్ర ప్రభుత్వమే 80 శాతం నిధులు ఇస్తోందని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. అయితే ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చెప్పకుండా తమకే క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. “ఇవన్నీ రాహుల్‌ గాంధీ ఇచ్చారా? లేక కేసీఆర్‌ తెచ్చారా? ఇది మోదీ ప్రభుత్వ నిబద్ధత కాదా?” అంటూ సభలో ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై కూడా కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకే పరిమితమైందని ఆరోపించారు. ముఖ్యంగా ముస్లింల కోసమే ప్రభుత్వం పనిచేస్తోందని, సమాజంలో విభజన రాజకీయాలకు కాంగ్రెస్ తెరలేపిందని మండిపడ్డారు. ‘SIR’ పేరుతో ప్రభుత్వం ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టిస్తోందని ఆరోపించారు. ప్రజా సమస్యలను పక్కనబెట్టి మత రాజకీయాలపై దృష్టి పెట్టడం కాంగ్రెస్ అసలు స్వరూపమని విమర్శించారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!