తమిళనాడు రాజకీయాల్లో కొత్త శక్తిగా ఎదుగుతున్న టీవీకే పార్టీ ప్రభావం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నార లోకేష్ స్పందిస్తూ, పార్టీ అధినేత దిజయ్ కు అభినందనలు తెలిపారు. రాజకీయాల్లో తొలి అడుగులోనే సాధించిన విజయాన్ని ప్రశంసిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
సోషల్ మీడియా వేదిక X లో లోకేశ్ చేసిన పోస్టు ప్రస్తుతం విస్తృత చర్చకు దారితీసింది. “ఈ విజయం ఓటర్ల ఆకాంక్షలను ప్రతిబింబిస్తోంది. రాజకీయ యవనికపై సరికొత్త కోణాన్ని ఆవిష్కరించారు” అని పేర్కొంటూ విజయ్ను అభినందించారు. ప్రజా జీవితంలోకి అడుగుపెట్టిన విజయ్ బాధ్యతతో, నిబద్ధతతో ప్రజల ఆశలను నెరవేర్చే దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
లోకేశ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రాజకీయ నాయకులు, విశ్లేషకులు, నెటిజన్లు ఈ విషయంపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నేతల నుంచి కూడా విజయ్‌కు అభినందనలు వెల్లువెత్తే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
టీవీకే పార్టీ ఎదుగుదల తమిళనాడు రాజకీయాల్లో గణనీయమైన మార్పులకు దారితీసే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రధాన పార్టీల మధ్య కొనసాగుతున్న పోటీలో ఇప్పుడు కొత్త ప్రత్యామ్నాయ శక్తి ప్రవేశించడం రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా యువతలో విజయ్‌కు ఉన్న క్రేజ్, ప్రజా సమస్యలపై ఆయన చూపుతున్న దృష్టి పార్టీకి బలాన్ని చేకూర్చుతున్నాయి.
విజయ్ రాజకీయ ప్రయాణం ప్రారంభ దశలోనే మంచి స్పందన రావడం విశేషం. ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబించేలా ఆయన ముందుకు సాగితే భవిష్యత్తులో మరింత కీలక పాత్ర పోషించే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.





