అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి సమీపంలో జాతీయ రహదారిపై ఈరోజు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. భువనేశ్వర్ నుంచి చెన్నైకి ప్రయాణిస్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న పంట కాల్వలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో సుమారు 20 మంది ప్రయాణికులు గాయపడగా, వారిలో కొందరికి స్వల్ప గాయాలు కాగా మరికొందరికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ బస్సు విశాఖపట్టణం నుంచి మొత్తం 38 మంది ప్రయాణికులతో చెన్నై వైపు బయలుదేరింది. ప్రయాణం సజావుగా సాగుతుండగా నక్కపల్లి సమీపానికి రాగానే డ్రైవర్ అకస్మాత్తుగా బస్సుపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో బస్సు రహదారి పక్కకు దూసుకెళ్లి పంట కాల్వలోకి దూసుకెళ్లిందన్నారు.
ప్రమాదం గుర్తించిన సమీప గ్రామాస్థులు సంఘటనా స్థలానికి చేరుకుని. బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసే చర్యలు చేపట్టారు. గ్రామస్థుల స్పందన వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానికుల ధైర్యసాహసాలను పలువురు ప్రశంసిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే 108 అంబులెన్స్ సిబ్బంది గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం గాయపడిన వారు చికిత్స పొందుతున్నారని, వారి ప్రాణాలకు ప్రమాదం లేదని వైద్యులు సూచించారు.
ఈ ప్రమాదానికి డ్రైవర్ అలసట, అధిక వేగం లేదా రహదారి పరిస్థితులు కారణంగా ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ముఖ్యంగా తెల్లవారుజామున జరిగింది కాబట్టి డ్రైవర్ నిద్రమత్తు లో ఉన్నాడని అనుమానిస్తున్నారు.
ఇటీవలి కాలంలో జాతీయ రహదారులపై ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు డ్రైవర్లకు తగిన విశ్రాంతి కల్పించడంతో పాటు వాహనాల ఫిట్నెస్పై కచ్చితంగా పర్యవేక్షణ జరపాల్సిన అవసరం ఉందని ప్రజలు సూచించారు.
ప్రభుత్వాలు ప్రయాణికుల భద్రత కోసం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.





