హైదరాబాద్‌లోని రాజీవ్ గాందీ ఇంటర్ నేషనల్ క్రికేట్ స్టేడియం వేదికగా జరిగిన ఉత్కంఠభరితమైన ఐపీఎల్ పోరులో సన్ రైజర్స్ అద్భుత విజయం సాధించింది. అన్ని విభాగాల్లోనూ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన హైదరాబాద్ జట్టు, రాజస్తాన్ రాయల్ పై 57 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన జట్టు, ప్రారంభం నుంచే రన్స్ వర్షం కురిపించింది. మ్యాచ్ ప్రారంభం నుంచే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు దూకుడుగా ఆడింది. ముఖ్యంగా కెప్టెన్ ఇసాన్ కిషన్ తన అద్భుతమైన బ్యాటింగ్‌తో జట్టుకు బలమైన పునాది వేశాడు. అతని దూకుడు ఇన్నింగ్స్ ప్రత్యర్థి బౌలర్లను పూర్తిగా ఒత్తిడిలోకి నెట్టింది.
ఈ మ్యాచ్ సమయంలో ఇషాన్ కిషన్‌కు ఇతర బ్యాట్స్‌మెన్ నుంచి కూడా మంచి సహకారం లభించింది. సరైన సమయంలో బౌండరీలు, సిక్సర్లు కొడుతూ జట్టు స్కోరును భారీ స్థాయికి తీసుకెళ్లారు. దీంతో నిర్ణీత ఓవర్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ పోటీదారులకు కఠినమైన లక్ష్యాన్ని నిర్ధేశించింది. అనంతరం బౌలింగ్‌లో కూడా తన దూకుడును కొనసాగించింది.
సన్ రైజర్స్ హైదరాబాద్ ఇచ్చిన లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్రారంభంలోనే వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడింది. దీంతో హైదరాబాద్ బౌలర్లు క్రమంగా మ్యాచ్‌పై పట్టు సాధించారు. ముఖ్యంగా కొత్తగా జట్టులోకి వచ్చిన బౌలర్లు ప్రఫుల్ హింగే, మరియు షాకీబ్ హుస్సేన్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శించారు. వీరి బౌలింగ్ ను ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను తలపడలేకపోయారు.
పేస్, స్పిన్ కలయికతో హైదరాబాద్ బౌలింగ్ విభాగం ప్రత్యర్థిని చిత్తు చేసింది. ప్రతి ఓవర్లోనూ ఒత్తిడి పెంచుతూ వికెట్లు తీసుకుంటూ వెళ్లింది. ఫీల్డింగ్‌లో కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మెరుపులు మెరిపించింది. కీలక క్యాచ్‌లు, రన్ అవుట్ అవకాశాలను చేస్తూ దూసుకుపోయింది.
రాజస్థాన్ రాయల్స్ జట్టు ఎప్పుడూ మ్యాచ్‌లోకి తిరిగి రావడానికి ప్రయత్నించినా, హైదరాబాద్ బౌలర్ల దెబ్బకు ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి. చివరికి నిర్ణీత ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకోలేకపోయిన రాజస్థాన్ జట్టు, 57 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది.
ఈ విజయంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ పాయింట్ల పట్టికలో తన స్థాయిని మరింత బలపర్చింది. జట్టు ప్రదర్శనపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా యువ ఆటగాళ్ల ప్రదర్శన భవిష్యత్తులో జట్టుకు మంచి సంకేతంగా భావిస్తున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ తన తదుపరి మ్యాచ్ ను ఈ నెల 18న చెన్నై సూపర్ కింగ్స్ తో సొంతగడ్డపై తలపడనుంది.





