11 ఏళ్ల బాలికపై అత్యాచారం

Must read

బెంగళూరు నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. కేవలం 11 ఏళ్ల బాలికపై ఓ వలస కార్మికుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన సమాజాన్ని కలచివేస్తోంది. ఈ ఘటనలో నిందితుడైన 28 ఏళ్ల మహమ్మద్ మున్నాను పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసులు వివరాల ప్రకారం, బాధిత చిన్నారి తన కుటుంబంతో కలిసి బెంగళూరులో నివసిస్తోంది. బుధవారం సాయంత్రం ఆమె ఇంటి బయట ఇతర పిల్లలతో కలిసి ఆడుకుంటున్న సమయంలో అక్కడ సమీపంలో నిర్మాణ పనులు జరుగుతుండగా, బీహార్‌కు చెందిన మహమ్మద్ మున్నా అనే కార్మికుడు ఆమెను గమనించాడు.

ఆపై అతను మాయమాటలతో చిన్నారిని ఆకర్షించి, పక్కనే నిర్మాణంలో ఉన్న భవనంలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై లైంగిక దాడికి పాల్పడాడు. అనంతరం, జరిగిన విషయం ఎవరికీ చెప్పవద్దని చిన్నారిని బెదిరించి, ఆమె చేతిలో రూ.150 పెట్టి ఇంటికి పంపించేశాడని పోలీసులు తెలిపారు.

చాలాసేపటి నుంచి కనిపించని చిన్నారి కొంతసేపటి తర్వాత ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన సమయంలో బాలిక చేతిలో డబ్బులు కనిపించడంతో అనుమానంతో ఆమెని ప్రశ్నించారు. చిన్నారి మొదట భయంతో ఏమీ చెప్పకపోయినా, తర్వాత జరిగిన ఘటనను తల్లిదండ్రులు .వివరించింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.

చిన్నారి బాలికతో కలిసి తల్లిదండ్రులు జ్ఞానభారతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీ, స్థానికుల సమాచారం ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, అతడిని రిమాండ్‌కు తరలించినట్లు సమాచారం.

ఈ ఘటన మరోసారి చిన్నారుల భద్రతపై ఆందోళనలను కలిగిస్తుంది. ముఖ్యంగా నిర్మాణ ప్రాంతాలు, అపరిచిత వ్యక్తులు ఉన్న ప్రదేశాల్లో పిల్లలు ఒంటరిగా తిరగకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!