కోస్తాలో వానలు, సీమలో భగభగలు

Must read

ఆంధ్రప్రదేశ్‌లో రాష్ర్టంలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.. రాయలసీమ ప్రాంతాల్లో ఎండలు మండుతుంటే, కోస్తా ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APDM) ఎండీ ప్రఖర్ జైన్ ప్రజలకు అప్రమత్తమైన సూచనలు చేశారు.

తెలంగాణ, రాయలసీమ, అంతర తమిళనాడు మీదుగా మన్నార్ వరకు ద్రోణి కొనసాగుతోందని దీని కారణంగానే కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు ఎల్లప్పుడూ పడే అవకాశం ఉందని తెలిపారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

ఈ సమయంలో పొలాల్లో పనిచేసే రైతులు, పశువుల కాపరులు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరికలు జారీ చేశారు. “పిడుగులతో కూడిన వర్ష సమయంలో ఎటువంటి పొలాల్లో లేదా ఎత్తైన ప్రాంతాల్లో నిలబడటం ప్రమాదకరమని ఆయన సూచించారు.

రాయలసీమ ఎండలు ఎక్కువగా ఉండడంతో ప్రజలు అప్పమత్తంగా ఉండాలన్నారు. అధిక ఉష్ణోగ్రతల వల్ల ప్రజలు, వృద్ధులు, చిన్నపిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జైన్ హెచ్చరించారు. బుధవారం పల్నాడు జిల్లా క్రోసూరు, తిరుపతి జిల్లా వరదయ్యపాలె ప్రాంతాల్లో అత్యధికంగా 42.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని ఆయన తెలిపారు.

అదేవిధంగా చిత్తూరు, నంద్యాల, కడప, అనంతపురం, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఆయన వెల్లడించారు. వాతావరణ శాఖ ప్రకారం, ఈ స్థితి వచ్చే రెండు మూడు రోజుల్లో కొనసాగే అవకాశం ఉందని, ఎండలు, వర్షాలు ప్రజలకు, వ్యవసాయ పనులకు ప్రభావం చూపుతాయన్నారు.

ఎండ కారణంగా తాగునీటి ఇబ్బందులు కలుగుతాయని, చిన్నపిల్లలు, వృద్ధుల పై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే, పిడుగులతో కూడిన వర్ష సమయంలో ఎలక్ట్రికల్ లైన్‌ల దగ్గర వెళల్కూడదని, పొలాల్లో పనిచేసేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!