హైదరాబాద్లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారంలో వచ్చిన ‘వీకెండ్ కామెంట్ బై ఆర్కే’ కథనం కారణంగా. వైసీపీ శ్రేణులు, ప్రధానంగా వైసీపీ నేత అంబటి రాంబాబు నేతృత్వంలో, ఆఫీసు వద్ద భారీ నిరసనకు దిగారు.
వివరాల ప్రకారం, ఈ కథనం లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి యజమాని, ప్రముఖ పాత్రికేయుడు రాధాకృష్ణ ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్పై ‘మావిగన్’ వ్యాఖ్యలను విశ్లేషించారు. వీకెండ్ కామెంట్లో రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలు, కొత్త పలుకు కాలమ్లో కూడా ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురించబడింది. ఇందులో ఉన్న విషయాలను వైసీపీ క్యాడర్ తీవ్రంగా మహిళలను అవమానించేలా భావిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంగళవారం ఉదయం, హైదరాబాద్ ఫిల్మ్ నగర్లోని ఏబీఎన్ ఆఫీసు వద్ద వైసీపీ కార్యకర్తల భారీగా కార్యలయాన్ని చుట్టుముట్టారు. పోలీసులు ముందుగానే బారికేడ్లు ఏర్పాటు చేసి, కార్యాలయంలోకి చొచ్చుకెళ్లే నిరసనకారులను అడ్డుకున్నారు. ఈ సమయంలో, ఆఫీసు ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నిరసనకారులు తమ వాహనాలను రోడ్డుపైనే పార్క్ చేయడంతో, ఆ మార్గంలో వెళ్ళే వాహనాలకు తీవ్ర ఇబ్బంది కలిగింది.
సమీపంలో ఉన్న అపోలో ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన రోగులు కూడా ఈ పరిస్థిలో తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
పోలీసులు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నా వైసీపీ శ్రేణులు వినిపించుకోలేదు. నిరసనకారులు వైసీపీ నేత అంబటి రాంబాబు నేతృత్వంలో ఏపీ నుంచి హైదరాబాద్ కు వచ్చినట్లు తెలుస్తోంది. ట్రాఫిక్ నియంత్రణ, పబ్లిక్ సేఫ్టీ కోసం బారికేడ్లు, పోలీస్ ప్రత్యేక బలగాలను పర్యవేక్షణలో ఉంచారు.
ప్రస్తుతం, ఆఫీసు వద్ద ఉద్రిక్తత తగ్గించినప్పటికీ, రాజకీయ, మీడియా వర్గాల్లో ఈ సంఘటనపై వివాదాలు కొనసాగుతున్నాయి. వైసీపీ నేతలు, కార్యకర్తలు,ఆ ఫలితాలపై ప్రజా స్పందనను కూడా గమనిస్తున్నారు.





