తెలంగాణ రాష్ట్రంలో డీజీపీ శివారెడ్డి కాన్వాయ్ ట్రయల్ రన్ సందర్భంగా ములుగు జిల్లాలో చిన్న ప్రమాదం చోటు చేసుకుంది. ములుగు జిల్లా వెంకటాపురం సమీపంలో పోలీసులు ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా వెగంగా వెళ్తుండగా ఒక పోలీసు వాహనం అదుపు తప్పి ముందు వాహనాన్ని ఢికొట్టింది.
ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాదు. రెండు పోలీసు వాహనాలు మాత్రం దెబ్బతిన్నాయి. పోలీసులు తక్షణమే పరిస్థితిని నియంత్రించారు. ట్రయల్ రన్ నిర్వాహకులు, భద్రతా అధికారుల సహకారంతో వాహనాలను మరల నియంత్రణలోకి తీసుకున్నారు.
స్థానిక పోలీసులు మాట్లాడుతూ, ట్రయల్ రన్‌లో చోటుచేసుకున్న ఈ చిన్న ఘటనను సీరియస్‌గా తీసుకుని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా అన్ని భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేస్తామన్నారు. డీజీపీ శివధర్ రెడ్డి పర్యటనకు ఎటువంటి భంగం కలిగించని విధంగా అధికారులు చర్యలు తీసుకున్నారు.
తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలో చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ అధికారి సువర్ణతో కలిసి డీజీపీ శివధర్ రెడ్డి పర్యటించనున్నారు. డిజీపీ ప్రమాదం తప్పడంతో పోలీసులు ఉపిరి పీల్చుకున్నారు.
కర్రెగుట్టలోని పామునూరు సీఆర్పీఎఫ్ బస్ క్యాంపును డీజీపీ పరిశీలించి ఆ తర్వాత పోలీసు ఔట్ పోస్టుకు భూమి పూజ చేస్తారు. అనంతరం సమీప ప్రాంతంలోని గ్రామాలకు వేస్తున్న రోడ్లను పరిశీలించుకుని డీజీపీ కర్రెగుట్ట పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. డిజిపీ పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.





