నా దేశం భారత దేశం
ప్రపంచములో పెద్ద
లిఖిత రాజ్యాంగం కల్గిన దేశం.
పాలకులు నిస్వార్థ సేవలనే పేరుతో దోచు కునే రాజకీయ నేతలు..
మరి,కొంత మంది ప్రజలకు ఏం పని, నేతల వెంట ఉండే
అవసరమేమీ, స్వార్థ బుద్ధి లేకుంటే ఎందుకు
అమూల్యమైన సమయాన్ని వదలి బానిసల్లా ” జీ” హుజూర్
అంటూ ఎందుకుంటారు
మానవత్వం మరచి…
ప్రాణాలను సైతం ప్రణం గా పెట్టి, ఇతరులకు ప్రాణ హాని కలిగించుట కు, కూడ వెనుకాడని
మందబుద్ధిని కలిగిన కష్టించి జీవించలేని
సోమరులు.
నేతల ఆజ్ఞా కోసం ఎదురుచూస్తూ, కాపలా కాసే బలవంతుల వలె
ప్రదర్శనలు ఎందుకు,
కేవలం సేవల పేరుతో
నాయకులు మోసం చేస్తున్న వీరు అందులో
ఎందుకు భాగస్వాము
లౌతారు…
కేవలం, ముక్క, చుక్క,
బొక్కకు బానిసై ఎంగిలి మెతుకులు వేస్తే ఆత్మాభిమానం వదలి
రేయి పగలు పడి ఉంటారు ఎందుకో..
అందుకే నేనంటా ను ,కొంత మంది జీవితాలు స్వార్థబుద్ధికి బానిసలై, ఆత్మాభిమానం,
ఆత్మగౌరవం లేని జీవితాలు వారికి ప్రీతి పాత్రం కావచ్చును..
కష్టించి జీవించడం
వారికి అయిష్టత కావచ్చును. బానిస జీవితం స్వర్గతుల్య మని వారి భావన కావచ్చును…
చివరికి రాజకీయంలో శ్రమ ఒక్కరిది,సుఖం
ఒక్కరిది..సొమ్ము ప్రజలది, అధికారం నాయకులది. చివరికి రాజకీయాన్ని మోసం చేసే గుణమున్న
కపట నాటక సూత్రదారి బలవంతుడైన మోసకారి నాయకుడే వారికి దైవం…
అందుకే నేనంటాను
ప్రజలే అల్ప సంతోషులు, ఉచితాలకు అలవాటు పడ్డ బలహీనులు, మొత్తానికి స్వార్ధపర
భావాలున్న మనుషులు..
గుండు కోటేశ్వర్ రావు





