రన్‌వేపై పేలిన విమానం.. ఇద్దరు పైలట్ల మృతి!

Must read

డొమినికన్ రిపబ్లిక్‌లో ఆదివారం జరిగిన ఘోర విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అమెరికా రిజిస్ట్రేషన్ కలిగిన గల్ఫ్‌స్ట్రీమ్ G200 ప్రైవేట్ జెట్ అత్యవసర ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తున్న సమయంలో కుప్పకూలి భారీ అగ్నిప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో విమానంలోని పైలట్, కో-పైలట్ ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందినట్లు డొమినికన్ పౌర విమానయాన అధికారులు ధృవీకరించారు.

ప్రమాదానికి గురైన గల్ఫ్‌స్ట్రీమ్ G200 విమానం డొమినికన్ రిపబ్లిక్‌లోని లా రొమానా అంతర్జాతీయ విమానాశ్రయంలో నుంచి అమెరికాలోని అస్టిన్​​ నగరానికి బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే విమానంలో తీవ్రమైన సాంకేతిక లోపం తలెత్తినట్లు సమాచారం. అప్పటికి విమానం లా రొమానా విమానాశ్రయానికి నైరుతి దిశలో సుమారు 16 నాటికల్ మైళ్ల దూరంలో ప్రయాణిస్తోంది. సమస్యను గుర్తించిన పైలట్లు వెంటనే అత్యవసర పరిస్థితిని ప్రకటించి తిరిగి విమానాశ్రయానికి చేరేందుకు అనుమతి కోరారు.

విమానాశ్రయ నియంత్రణ కేంద్రం అనుమతి ఇవ్వడంతో విమానం తిరిగి లా రొమానా వైపు మళ్లింది. అయితే రన్‌వే 29పై ల్యాండ్ అయ్యే క్రమంలో పరిస్థితి అదుపు తప్పింది. ప్రత్యక్ష సాక్షులు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం విమానం అధిక వేగంతో రన్‌వేపై దిగిన అనంతరం స్థిరత్వం కోల్పోయి పక్కనే ఉన్న గడ్డి మైదానంలోకి దూసుకెళ్లింది. కొద్ది క్షణాల్లోనే అది భారీ శబ్దంతో పేలి అగ్నిగోళంలా మారిపోయింది.

ప్రమాదం జరిగిన వెంటనే విమానాశ్రయ అత్యవసర సిబ్బంది, అగ్నిమాపక దళాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ అప్పటికే విమానం పూర్తిగా అగ్నికి ఆహుతైంది. విమానంలో ప్రయాణికులు ఎవరూ లేరని, కేవలం పైలట్ మరియు కో-పైలట్ మాత్రమే ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఇద్దరూ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.

డొమినికన్ సివిల్ ఏవియేషన్ ఇన్‌స్టిట్యూట్ (IDAC) ఏవియేషన్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ కమిషన్ (CIAA) ఈ ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించాయి. విమానంలో ఏర్పడిన సాంకేతిక లోపం స్వరూపం ఏమిటి, ల్యాండింగ్ సమయంలో ఎందుకు నియంత్రణ కోల్పోయింది, అగ్నిప్రమాదానికి దారితీసిన కారణాలేమిటి అనే అంశాలపై అధికారులు విచారణ చేపట్టారు. ప్రాథమిక సమాచారం ప్రకారం యాంత్రిక లోపమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని భావిస్తున్నప్పటికీ, పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం మాత్రమే వెల్లడవుతాయని అధికారులు తెలిపారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!