అమరవీరుల పోరాటం, ఆత్మత్యాగల ఫలితంగా సాధించుకున్నదే.. తెలంగాణ రాష్ట్రం..:ఎస్పీ పరితోష్ పంకజ్

Must read

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయం నందు ఉదయం 07:20 నిమిషాలకు జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి జాతీయ గీతాలాపన చేసిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అవతరించి 12 వసంతాలు పూర్తి చేసుకొని, నవశకానికి నాంది పలుకతూ 13 వసంతంలోకి అడుగిడుతున్న శుభ సందర్భంగా జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులకు, సిబ్బందికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మహనీయుల ఆశయ సాధనలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి పౌరులుగా, తెలంగాణ బిడ్డలుగా మనవంతు కృషి చేయవలసిందిగా సూచించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలన సౌలభ్యం కొరకు కొత్త జిల్లాలు ఏర్పడి, యువతకు ఉద్యోగ, ఉపాది అవకాశాలు మెరుగయ్యాయి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ది నా భాద్యత అని ప్రతి ఒక్క పోలీసు అధికారి, యువత భావించాలన్నారు. ఎందరో అమరుల ఆత్మ బలిదానాలు, మహనీయుల త్యాగ ఫలమే తెలంగాణ రాష్ట్రం అని, తెలంగాణ రాష్ట్ర అభివృద్దికి కట్టుబడి ఉండి, రాష్ట్ర అభివృద్ది, మహనీయుల ఆశయ సాధనలో తెలంగాణ రాష్ట్ర పౌరులుగా, తెలంగాణ బిడ్డలుగా మనవంతు కృషి చేయవలసిందిగా సూచించారు.

సంగారెడ్డి జిల్లా పోలీసు శాఖ తరపున మన చుట్టూ జరుగుతున్న వివిధ రకాల ఆన్లైన్ మోసాలు, పొక్సో అత్యాచార కేసుల గురించి జిల్లా ప్రజలను కమ్యూనిటీ పోలిసింగ్ ద్వారా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడం జరుగుతుంది. అన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు.ఎస్పీ చైతన్య రెడ్డి, డిఎస్పి సత్యయ్య గౌడ్, ఎ.ఆర్. డిఎస్పి నరేందర్, ఎస్.బి ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్, ఐ. టి. సెల్ ఇన్స్పెక్టర్ సదా నాగరాజు, ఆర్.ఐ.లు సురేష్, డానియెల్, శ్రీనివాస్ రావ్, డి.పి.ఓ సూపర్డెంట్ మోహనప్ప, అశోక్, మరియు ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!