రైతు డిస్కమ్ ప్రభుత్వ కుట్ర :కల్వకుంట్ల కవిత

Must read

రైతు డిస్కం పేరుతో రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణ రైతాంగాన్ని నట్టేట ముంచే కుట్ర చేస్తోందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. రైతులు అడగకుండానే విద్యుత్ సంస్కరణల పేరుతో చేపట్టిన ఈ చర్య రైతుల పాలిట శాపంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ డిస్కమ్ ఏర్పాటు వ్యవసాయంపై ఎండ్రిన్ చల్లడమేనని ఆవేదన వ్యక్తం చేశారు.

రైతు డిస్కమ్ ఏర్పాటుపై తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఎర్రగడ్డలోని సంస్థ కార్యాలయంలో నిర్వహించిన పబ్లిక్ హియరింగ్ లో కవిత పాల్గొని మాట్లాడారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రైతులకు మంచి చేసే ఆలోచనలో ఉంటే ఆరు నెలలుగా ఈ విషయాన్ని ఎందుకు దాచి ఉంచిందో చెప్పాలన్నారు.

యావత్ తెలంగాణ రైతాంగానికి అన్యాయం చేసే ప్రయత్నాలను మానుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే 1999 నాటి కాల్పుల ఘటనను కొని తెచ్చుకున్నట్లే అవుతుందని హెచ్చరించారు. తెలంగాణ రైతుల భవితవ్యాన్ని నిర్ణయించే ఈ అంశంపై 33 జిల్లాల్లో పబ్లిక్ హియరింగ్ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఏ విధంగానూ వయిబుల్ కాని ఈ ప్రపోజల్ ను తిరస్కరించాలని ఈఆర్సీకి విజ్ఞప్తి చేశారు.

రైతులకు ఇచ్చే ఫ్రీ కరెంట్, ఉచిత విద్యుత్ స్కీం, లిఫ్ట్ ఇరిగేషన్ కోసం వాడే పవర్ కు ప్రభుత్వమే డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందని గుర్తు చేశారు. అలాంటప్పుడు ఈ సంస్థ ఏ విధంగా లాభాల్లో ఉంటుందో చెప్పాలన్నారు. కేవలం రైతులకు నష్టం చేసేందుకు ఈ పిచ్చి పనిచేస్తున్నారని కవిత విమర్శించారు. రైతులకు అన్యాయం చేస్తే 1999 నాటి కాల్పుల ఘటన పునరావృతం అయ్యే పరిస్థితి ఉంటుందని హెచ్చరించారు. అలాంటి సంఘటనలు కొని తెచ్చుకోవద్దంటే ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

రైతు డిస్కం వద్దే వద్దంటే అందులో ఆంధ్రా ఉద్యోగులకు పెత్తనం కట్టేబెట్టే ప్రయత్నం చేస్తున్నారని కవిత అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత 24 గంటలు కరెంట్ వచ్చేందుకు తెలంగాణ ఉద్యోగులు కష్టపడితే వారికే కష్టమొచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. 12 వందల మంది తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు నష్టం చేశారని చెప్పారు.

అదే సమయంలో ఆంధ్రా నుంచి మన వద్దకు వచ్చిన 17 వందల మంది ఉద్యోగులకు ప్రమోషన్లు ఇచ్చారన్నారు. విభజన చట్టాలను పక్కన పెట్టి ఫోర్స్ ఫుల్ గా ఆంధ్రా ఉద్యోగులను మనకు ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పటికే జెన్ కో, రెడ్ కో, సదరన్ డిస్కమ్ ఇలా అన్నింట్లో ఆంధ్రావాళ్ల పెత్తనమే ఉందన్నారు. తెలంగాణ డిస్కమ్ లలో ఆంధ్రావాళ్ల పెత్తనం ఉండొద్దని కవిత కోరారు. రైతు డిస్కం తప్పనిసరి పరిస్థితుల్లో పెట్టాల్సి వస్తే అందులో తెలంగాణ వాళ్లే ఉండాలని డిమాండ్ చేశారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!