దేశవ్యాప్తంగా వైద్య విద్యను ఆశిస్తున్న లక్షలాది మంది విద్యార్థులకు భారీ షాక్ తగిలింది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET-UG) 2026 ప్రశ్నపత్రం లీక్ అయినట్లు నిర్ధారణ కావడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ పరిణామంతో సుమారు 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడింది. ఇప్పటికే పరీక్ష కోసం నెలల తరబడి కఠినంగా సిద్ధమవుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దేశంలో వైద్య విద్యలో ప్రవేశాలకు అత్యంత కీలకమైన పరీక్షగా నీట్ గుర్తింపు పొందింది. ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో యంబీబీఎస్ ఏడీఎస్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు ఈ పరీక్ష ఫలితాలే ఆధారం. అలాంటి కీలక పరీక్ష ప్రశ్నపత్రం లీక్ కావడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. విద్యా వ్యవస్థ విశ్వసనీయతపై కూడా ఈ ఘటన ప్రశ్నలు లేవనెత్తుతోంది.
దర్యాప్తు సంస్థల ప్రాథమిక విచారణలో మహారాష్ట్రలోని నాసిక్ కేంద్రంగా ఈ లీకేజీ వ్యవహారం ప్రారంభమైనట్లు వెల్లడైంది. అనంతరం అది దేశంలోని పలు రాష్ట్రాలకు విస్తరించినట్లు అధికారులు గుర్తించారు. ఈ కుంభకోణంలో నాసిక్‌కు చెందిన శుభం ఖైర్నార్? అనే యువకుడు కీలక పాత్ర పోషించినట్లు సీబీఐ అధికారులు చెబుతున్నారు. 30 ఏళ్ల వయసున్న శుభం ప్రస్తుతం బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ చదువుతున్నట్లు సమాచారం.
పుణేకు చెందిన ఓ వ్యక్తి నుంచి శుభం నీట్ ప్రశ్నపత్రాన్ని రూ.10 లక్షలకు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం అదే పేపర్‌ను హర్యానాకు చెందిన మరో వ్యక్తికి రూ.15 లక్షలకు విక్రయించి రూ.5 లక్షల లాభం పొందినట్లు అధికారులు గుర్తించారు. ఈ మొత్తం లావాదేవీ ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్ ద్వారా జరిగినట్లు సమాచారం. సాంకేతికతను వినియోగిస్తూ గోప్యంగా ఈ నెట్వర్క్ పనిచేసినట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి.
ఇప్పటికే ఈ కేసులో పలు ప్రాంతాల్లో సీబీఐ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. పుణే, నాసిక్, ఢిల్లీ, హర్యానా తదితర ప్రాంతాల్లో అనుమానితుల ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, డిజిటల్ డాక్యుమెంట్లు, బ్యాంక్ లావాదేవీలను అధికారులు పరిశీలిస్తున్నారు. మరికొంత మంది మధ్యవర్తులు, కోచింగ్ సెంటర్ల పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పరీక్ష రద్దు నిర్ణయం విద్యార్థుల్లో తీవ్ర నిరాశను కలిగించింది. లక్షలాది మంది విద్యార్థులు రెండేళ్లుగా కష్టపడి సిద్ధమవుతుండగా, కొందరు కోచింగ్ కోసం లక్షల రూపాయ





