గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కంటే ప్రత్యేక రాష్ట్రం లోనే బీసీలకు ఎక్కువగా అన్యాయం జరుగుతుందని, తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత బీసీల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిల పడ్డ చిన్నంగా ఉందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నేడు హైదరాబాదులోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లోని సురవరం ప్రతాపరెడ్డి ఆడిటోరియంలో బీసీ విద్యార్థి యువజన రాష్ట్ర సదస్సు జరిగింది. ఈ సదస్సుకు జాజుల శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వస్తే మెజార్టీ ప్రజలకు రాజ్యాధికారం లభిస్తున్నది, ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయం తెలంగాణలో జరగదని రాజకీయ పార్టీలు పదేపదే చెప్పడం మూలంగా రాష్ట్ర సాధన కోసం శ్రీకాంత చారి నుంచి సిరిపురం యాదయ్య ఎవరు 1100 మంది బీసీలు బలిదానం చేశారని, బడుగులు బలిదానాలు చేస్తే ముఖ్యమంత్రి పీఠాల మీద అగ్రకులాలు కూర్చుని తీరని అన్యాయం తలపెడుతున్నారని ఆయన ఆరోపించారు
ఉమ్మడి రాష్ట్రంలో లక్షలాదిమంది బడుగు విద్యార్థుల చదువులకు భరోసా నింపిన ఫీజుల రీయింబర్స్మెంట్ పథకాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అగ్రకుల ప్రభుత్వాలు జీవో నెంబర్ ఏడు ను విడుదల చేసి ఫీజుల రియంబర్స్మెంట్ స్కీంకు ఉరి తీసింధని, ఫీజుల బకాయిలు ఇవ్వకుండా పేద విద్యార్థుల పీకలు పిసుకుతున్నారని ఆయన మండిపడ్డారు
ప్రస్తుతం పక్క రాష్ట్రంలో చట్టబద్ధమైన బీసీ సబ్ ప్లాన్, ఏలాంటి షరతులు లేకుండా ఫీజుల రియంబర్స్మెంట్ స్కీం ను యధావిధిగా అమలు చేస్తూ ఫీజుల బకాయిలు లేకుండా ఏపీ ప్రభుత్వం పాలన చేస్తుంటే, తెలంగాణ లోని గత బిఆర్ఎస్, నేటి కాంగ్రెస్ ప్రభుత్వాలు బీసీల అన్యాయం చేయడంలో దొందు దొందేనన్నారు
జనాభాలో 60% పైగా ఉన్న బీసీలను అన్ని రాజకీయ పార్టీలు పూర్తిగా విస్మరిస్తున్నాయని, అగ్రకుల రాజకీయ పార్టీలను 2029 నాటికి గోరికట్టి తీరుతామని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు నేపాల్ దేశంలో విద్యార్థులు యువత ఏ విధంగా జెన్ జీ ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకువచ్చి రాజకీయ సునామీని సృష్టించి అవినీతిపరులను, రాజకీయ తిమింగలాలను తరిమికొట్టినట్టే ఇక్కడ కూడా బీసీ విద్యార్థి యువజనులు జట్టు గట్టి బీసీల రాజ్యాధికారం లక్ష్యంగా ముందుకు సాగాలని శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు
బీసీ ఉద్యమంలో చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్న హైదరాబాద్ నగరానికి చెందిన గోధ అరుణ్ కుమార్ గౌడ్ ను బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమిస్తున్నట్లు జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు అలాగే గ్రేట్ హైదరాబాద్ బీసీ విద్యార్థి సంఘం కార్యదర్శిగా వి మణికంఠ, ఉపాధ్యక్షులుగా జే జస్వంత్ ఎల్బీనగర్ జోన్ కార్యనిర్వాహక అధ్యక్షులుగా సిహెచ్ జయరాం, నాగోల్ జోన్ కార్యవర్గ అధ్యక్షులుగా సిహెచ్ ప్రశాంత్ ను నియమిస్తున్నట్లు జాజుల ప్రకటించారు
బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, బీసీ సంక్షేమ సంఘం కార్య నిర్వాహక అధ్యక్షులు గుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు కనకాల శ్యాం కురుమ, గూడూరు భాస్కర్, బ్రహ్మచారి, శ్రీనివాస చారి తదితరులు పాల్గొన్నారు





