ఐసీసీసీ కేంద్రంలో పోలీస్ స్పందన టీమ్స్ ప్రారంభం

Must read

రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల భద్రతను బలోపేతం చేసే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఓకే ఓకే మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. ధనసరి అనసూయ సీతక్క ఐసీసీసీ (ICCC) కేంద్రంలో పోలీస్ స్పందన టీమ్స్‌ను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్, డీజీపీ శివధర్ రెడ్డి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, చిన్నారులు, బాలికలు, మహిళల రక్షణ కోసం మహిళ పోలీసులతో ప్రత్యేకంగా స్పందన టీమ్స్ ఏర్పాటు చేయడం అభినందనీయం అని పేర్కొన్నారు. “స్పందన అంటే బాధితులకు తక్షణ రక్షణ అందించే పోలీస్ ఫోర్స్. వేధింపులు, హింసకు గురైన వారికి వెంటనే సహాయం అందించడం ఈ టీమ్స్ ప్రధాన లక్ష్యం” అని తెలిపారు.

బాధితుల మానసిక పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంటుందని, ఆ క్షణంలో ఎవరో తమను రక్షిస్తే బాగుంటుందనే ఆవేదన మహిళల్లో ఉంటుందన్నారు. తక్షణ స్పందన లేకపోతే ప్రాణాపాయం కలగవచ్చని, కొన్నిసార్లు ప్రాణనష్టం కూడా సంభవించే ప్రమాదం ఉందని చెప్పారు. అలాంటి క్రిటికల్ సమయంలో స్పందన టీమ్స్ అత్యంత కీలకంగా పనిచేస్తాయని ఆమె వివరించారు.

ప్రమాదం జరిగిన తర్వాత “గోల్డెన్ అవర్స్” చాలా ముఖ్యమని, ఆ సమయంలో సరైన వైద్యం, సహాయం అందిస్తే బాధితుల ప్రాణాలను కాపాడటమే కాకుండా, వారికి కొత్త జీవితం ఇవ్వగలమని మంత్రి సీతక్క అన్నారు.

మహిళా భద్రత విషయంలో తెలంగాణ పోలీసులు వాయువేగంతో పనిచేస్తున్నారని, నిందితులను త్వరగా పట్టుకుని కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. “న్యాయం ఆలస్యమైతే అన్యాయం జరిగినట్టే” అని పేర్కొంటూ, మహిళలకు సత్వర న్యాయం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.

విద్యార్థులలో మహిళలను గౌరవించే విధంగా ఆంశాల వంటి పాఠ్యాంశాలుగా చేర్చాలని ముఖ్యమంత్రిని విజ్ఞప్తి చేశారు. “శిక్షతో పాటు శిక్షణ కూడా అవసరం. అప్పుడే నేరాలను నిరోధించగలుగుతాము” అని అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యాన్ని మరింత పెంచుతామని, మహిళలు స్వేచ్ఛగా, భయంలేకుండా పనిచేసే వాతావరణాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!