రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (RTC) కార్మికులు చేపట్టిన సమ్మె నేపథ్యంలో సీతక్క కీలక ప్రకటన చేసింది. ఆర్టీసీ కార్మికులను తమ కుటుంబ సభ్యుల్లా భావిస్తున్నామని పేర్కొంటూ, సమ్మెను విరమించి వెంటనే విధుల్లో చేరాలని ప్రభుత్వం మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేసింది. కార్మికులు తమ సోదరులేనని, వారి సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపింది.
ఈ నేపథ్యంలో సీతక్క మాట్లాడుతూ సమ్మె సమస్యలకు శాశ్వత పరిష్కారం కాదు. చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని ఆమె స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆర్టీసీ కార్మికులు లేవనెత్తిన వివిధ సమస్యలను పరిశీలించేందుకు ఉన్నతాధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఈ కమిటీ నాలుగు వారాల్లో సమగ్ర నివేదిక సమర్పించనుందని ఆమె తెలిపింది.
కార్మికులు ముఖ్యంగా లేవనెత్తిన ప్రభుత్వంలో విలీనం, గుర్తింపు సంఘాల ఎన్నికలు వంటి కీలక అంశాలు ప్రస్తుతం సాంకేతికంగా పరిశీలనలో ఉన్నాయని ప్రభుత్వం వివరించింది. ఈ రెండు ప్రధాన అంశాల్లో ఆర్టీసీ కార్మిక సంఘాల మధ్య ఏకాభిప్రాయం తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు శాశ్వత పరిష్కారం దిశగా ముందుకు సాగుతున్నామని సీతక్క స్పష్టం చేశారు.
ఇది కాలయాపన కాదని, ఒక సమగ్ర ప్రక్రియలో భాగంగా ఈ చర్యలు చేపడుతున్నామని ఆమె వెల్లడించింది. కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి నిర్ణయం తీసుకుంటున్నామని పేర్కొంది. ప్రభుత్వంలో విలీనం జరగకపోయినా, ఆర్టీసీ ఉద్యోగులకు ప్రతి నెల మొదటి తేదీకి జీతాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఇంతకుముందు పెండింగ్లో ఉన్న పీఆర్సీ (PRC), డీఏ (DA)లు మరియు ఇతర బకాయిలను క్లియర్ చేసి కార్మికులకు అండగా నిలుస్తున్నామని ప్రభుత్వం వెల్లడించింది. అదేవిధంగా, పీఎఫ్ (PF), సీసీఎస్ (CCS) బకాయిలను కూడా గణనీయంగా తగ్గించామని పేర్కొంది. ఈ చర్యలు కార్మికుల ఆర్థిక భద్రతను బలోపేతం చేయడానికేనని ఆమె వివరణ ఇచ్చారు.





