చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్

Must read

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు తన 76వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా నటుడు జూనియర్ ఎన్టీఆర్ చేసిన పోస్టు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తన మామయ్యకు ఆయన తెలిపిన శుభాకాంక్షలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

“గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మావయ్య గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ సంపూర్ణ ఆరోగ్యంతో, సంతోషంతో ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.

రాష్ట్ర ప్రజలకు ఇదే విధమైన అంకితభావంతో, దార్శనికతతో సేవ చేయడానికి కావలసిన శక్తిని ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటున్నాను” అంటూ జూనియర్ ఎన్టీఆర్ తన సందేశంలో పేర్కొన్నారు.

ఈ సందేశం అభిమానులను ఆకట్టుకోవడంతో పాటు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. రాజకీయ, సినీ రంగాల మధ్య ఉన్న అనుబంధాన్ని ఈ సందేశం మరోసారి వెలుగులోకి తీసుకువచ్చింది.

చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, పేదలకు సహాయం వంటి సేవా కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు ఈ రోజును సేవా దినంగా నిర్వహించడం విశేషం.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!