గత రెండు రోజులుగా డిల్లీలో. ఆందోళన చేపట్టిన బిసి సంగాలా నేతలు డిల్లీలో సీఎం రేవంత్ రెడ్డినీ కలిశారు మహిళా బిల్లు,డీలిమిటేషన్ పై ఏ విధంగా పోరాడారో బీసీ డిమాండ్లపై కూడా అలాగేచొరవ చూపాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాదుల శ్రీనివాస్ గౌడ్ కోరారు
ఢిల్లీ లోనీ ముఖ్యమంత్రి నివాసంలో సీఎం రేవంత్ రెడ్డితో బీసీ ప్రతినిధుల బృందం భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపించిన 42 శాతం బీసీ రిజర్వేషన్ల పెంపుదలపై అలాగే ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న జాతీయ జనగణనలో బీసీ కులగనన చేపట్టేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ సీఎంకు వినతిపత్రం అందజేశారు
కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలు పూర్తికాకుండానే డీలిమిటేషన్, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి 131 వ రాజ్యాంగ సవరణ పార్లమెంటులో వీరిగిపోయేలా చేయడం శుభ పరిణామామన్నారు.
ఇదే స్పూర్తితో సామాజిక రిజర్వేషన్లపై విధించిన 50% పరిమితిని ఎత్తివేసేలా, తెలంగాణలో చేసిన 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లు పార్లమెంటులో ఆమోదించే విధంగా, అఖిలపక్షంతో ప్రధానితో భేటీ అయ్యి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని జాజుల శ్రీనివాస్ గౌడ్ సీఎం కు విజ్ఞప్తి చేశారు
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోట కల్పించాలని పార్లమెంటులో రాహుల్ గాంధీ గట్టిగా మాట్లాడారని, తెలంగాణ మోడల్ గా దేశవ్యాప్తంగా కులగనణ జరిగేలా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచుతామన్నారు.
బీసీ రిజర్వేషన్ల పెంపు ఇప్పటికీ పార్లమెంటు పరిశీలనలో ఉన్నందున తప్పకుండా ప్రధానిని కలిసి బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున చిత్తశుద్ధితో ముందుకు వెళదామని బీసీ నేతలకు సీఎం హామీ ఇచ్చారు





