తమిళనాడులో తిరిగి డిఎంకె కూటమిదే అధికారం

Must read

ముఖ్యమంత్రి,డీఎంకే అధినేత స్టాలిన్ నాయకత్వంలోని కూటమి తమిళనాడులో తిరిగి మంచి మెజారిటీతో అధికారంలోకి రాబోతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శనివారం ఆయన తమిళనాడు రాష్ట్రంలోని రాణిపేట జిల్లా షోలింగేర్ సర్కిల్ సమీపంలోని పండియానల్లుర్ లో ఏర్పాటుచేసిన రాహుల్ గాంధీ సభలో పాల్గొన్నారు.

సభ ఏర్పాట్ల ముందు శనివారం ఉదయం రాణి పేట జిల్లా కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశంలో ప్రసంగించారు. లౌకిక వాదాన్ని బలోపేతం చేయడంలో సంరక్షించడంలో తమిళనాడు ప్రజలు ముందుంటారని తెలిపారు.

వీరగడ్డకు, ఆత్మగౌరవానికి తమిళనాడు మారుపేరు అన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని తపించే ఒక సామాన్య కార్యకర్తగా మీ అందరి ముందుకు వచ్చానని డిప్యూటీ సీఎం తెలిపారు. తమిళనాడు అంటే కేవలం ఒక రాష్ట్రం కాదు అదొక సిద్ధాంతం. పెరియార్, అన్నాదురై, కలైంజర్ కరుణానిధి వంటి గొప్ప నేతలు ఇక్కడ సామాజిక న్యాయానికి పునాది వేశారని గుర్తు చేశారు.

ప్రస్తుతం ఢిల్లీ పీఠంపై కూర్చున్న పెద్దలు తమిళనాడు సంస్కృతిని, భాషను, హక్కులను కాల రాయాలని చూస్తున్నారన్నారు. సీఎం. ఏంకే స్టాలిన్ నాయకత్వంలో తమిళనాడు అభివృద్ధి పథంలోకి దూసుకుపోతుంది. రాహుల్ గాంధీ ప్రేమ సందేశం స్టాలిన్ అభివృద్ధి నినాదం ఒకటి అయ్యాన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహ జ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 కే గ్యాస్ సిలిండర్, రెండు లక్షల వరకు ఒకేసారి రైతులకు రుణమాఫీ, తెల్ల రేషన్ కార్డులు కలిగిన ప్రతి కుటుంబానికి సన్నబియ్యం, 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం వంటి హామీలను అమలు చేసి చూపించామని వివరించారు.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ డిఎంకె కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలి, తమిళ ప్రజలు వేసే ఓటు కేవలం ఒక గుర్తుపై వేసే ముద్ర కాదు అది విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా వేసే ఓటు అది నియంతృత్వానికి వ్యతిరేకంగా వినిపించే ప్రజాస్వామ్య గొంతుక అన్నారు.

మరోసారి తమిళనాడు తన ఆత్మ గౌరవాన్ని చాటుకోవాలి ఇక్కడ విద్వేషానికి చోటు లేదు కేవలం ప్రేమ, సమధర్మానికి మాత్రమే చోటు ఉందని నిరూపించాలి డీఎంకే కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!