తేజస్వి సూర్య క్షమాపణ చెప్పాలి :హరీష్ రావు డిమాండ్

Must read

తేజస్వి సూర్య వ్యాఖ్యలపై వివాదంతెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారత్-పాకిస్థాన్ విభజనతో పోల్చుతూ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి.

పార్లమెంట్ వేదికగా చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు.

సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్ రావు ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మాట్లాడిన తేజస్వి సూర్య వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజలు చేసిన పోరాటాన్ని అవమానించేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని హరీశ్ రావు మండిపడ్డారు

రాష్ట్రం ఏర్పడిన విధానం పూర్తిగా రాజ్యాంగబద్ధమని, దీన్ని ఇతర దేశ విభజనలతో పోల్చడం తగదని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారని, ఆ త్యాగాలను గుర్తించాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు.

రావుతో పాటు పలువురు తెలంగాణ నేతలు కూడా తేజస్వి సూర్య తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ అంశంపై సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తెలంగాణ ప్రజల భావోద్వేగాలను గౌరవించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఈ అంశం భవిష్యత్ ఎన్నికలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి బిజెపి తేజస్విన్ సూర్య క్షేమపణ చెబుతారో లేదో చూడాలి.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!