పూడి శ్రీహరి అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తున్నాం

Must read

వైయస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (పొలిటికల్‌), మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీపీఆర్‌ఓ పూడి శ్రీహరిని ఈ ఉదయం మఫ్టీలో వచ్చిన పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారు. వారు ఏ స్టేషన్‌కు చెందిన వారు, ఎక్కడి నుంచి వచ్చారు. అసలు ఏ కేసులో అదుపులోకి తీసుకుంటున్నారు.

అన్న ఏ విషయం చెప్పకుండా.. ఉదయం జగన్‌ని కలిసి, తిరిగి ఇంటికి వెళ్తున్న శ్రీహరిని మార్గమధ్యలో అడ్డగించి, బలవంతంగా ఎత్తుకెళ్లారు. శ్రీహరి ఫోన్‌ను, ల్యాప్‌టాప్‌ను స్వాథీనం చేసుకున్నారు. కనీసం ఇంటికి వెళ్లి రావడానికి కూడా అవకాశం ఇవ్వకుండా దౌర్జన్యంగా తీసుకెళ్లారని ఆయన ఆరోపించారు.

ఇప్పటి వరకు శ్రీహరిని ఎక్కడికి తీసుకెళ్తున్నది చెప్పలేదన్నారు. ఆ తర్వాత కాసేపటికి మరి కొంత మంది పోలీసులు శ్రీహరి ఇంటిపై దాడి చేశారన్నారు. బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించిన పోలీసులు దౌర్జన్యం చేసి, ఇంట్లో ఉన్న శ్రీహరి సహాయకుణ్ని బెదిరించి, బయటకు పంపారన్నారు. ఆ తర్వాత ఇల్లంతా సోదా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

అంతసేపూ ఇంట్లోకి ఎవ్వరినీ రానీయలేదని. చివరకు మా పార్టీ ప్రజాప్రతినిధులు వెళ్లినా పోలీసులు వారిని లోనికి రానీయకుండా అడ్డుకున్నారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వైయస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు టార్గెట్‌గా దారుణంగా కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు.

అక్రమ కేసులు, అరెస్టులు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఏకంగా సీనియర్‌ జర్నలిస్టు అయిన శ్రీహరిని అరెస్టు చేయడం అత్యంత హేయమైన చర్య అని. ఇది పూర్తిగా చట్టవిరుద్ధమని. కూటమి ప్రభుత్వంలో పోలీసులు చట్టాన్ని ఉల్లంఘించి వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. పోలీసుల తీరును ఖండిస్తున్నాం.
వెంటనే పూడి శ్రీహరిని బేషరతుగా విడిచిపెట్టాలని డిమాండ్‌ చేస్తున్నాం.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!