రాష్ట్ర విద్యాశాఖ గతంలో సాధించిన విజయాల కంటే వివాదాల వల్లే ఎక్కువగా వార్తల్లో నిలిచింది. విద్యాశాఖ బాధ్యతలు ఎవరు చేపట్టినా అది ఒక పెద్ద సవాల్‌గా మారేది. అలాంటి పరిస్థితుల్లో విద్యాశాఖను చేపట్టిన మంత్రి నారా లోకేష్ ఒక పెద్ద బాధ్యతను స్వీకరించారు. సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం, కష్టాన్ని ఇష్టంగా భావించే స్వభావం ఆయనకు ఉన్నందున ఈ బాధ్యతను కూడా విజయవంతంగా నిర్వహించాలనే లక్ష్యంతో ముందుకు సాగారు.
విద్యా వ్యవస్థలో చాలా కాలంగా వేళ్లూనుకున్న అనేక సమస్యలు ఉన్నాయి. ఉపాధ్యాయుల కొరత, మౌలిక వసతుల లోపం, పాఠ్య ప్రణాళికలలో అసమతుల్యత, విద్యార్థుల ఫలితాల్లో స్థిరత్వం లేకపోవడం వంటి సమస్యలు విద్యాశాఖను కుదిపేశాయి. ఈ సమస్యలను గుర్తించిన లోకేష్, వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరించడానికి కట్టుదిట్టమైన ప్రణాళికలు రూపొందించారు.
ఈ ఏడాది ఇంటర్మీడియట్ ఫలితాలు 12 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అత్యుత్తమ ఫలితాలు వచ్చాయి. విద్యా సంవత్సరంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ చేపట్టిన సంస్కరణలు, అమలుచేసిన ప్రణాళికల వల్లే మెరుగైన ఫలితాలు వచ్చాయని విద్యావేత్తలు విశ్లేషిస్తున్నారు.
పాఠ్య ప్రణాళికలలో కూడా సంస్కరణలు తీసుకువచ్చారు. విద్యార్థులలో సృజనాత్మకతను పెంచే విధంగా కొత్త విధానాలను ప్రవేశపెట్టారు. పరీక్షా విధానంలో పారదర్శకతను తీసుకురావడం ద్వారా విద్యార్థుల్లో విశ్వాసాన్ని పెంపొందించారు. విద్యార్థుల మానసిక ఒత్తిడిని తగ్గించడానికి కౌన్సెలింగ్ విధానాలను కూడా ప్రవేశపెట్టారు.
ఈ అన్ని చర్యల ఫలితంగా విద్యా రంగంలో స్పష్టమైన మార్పులు కనిపించడం ప్రారంభమైంది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాలు ఈ మార్పులకు నిదర్శనంగా నిలిచాయి. గతంతో పోలిస్తే ఉత్తీర్ణత శాతం పెరగడం, మెరిట్ సాధించిన విద్యార్థుల సంఖ్య అధికంగా ఉండడం వంటి అంశాలు ప్రభుత్వం చేపట్టిన చర్యలు సరైన దిశలో ఉన్నాయని సూచిస్తున్నాయి.
జూనియర్ కాలేజీ విద్యార్థులకు పకడ్బందీగా యూనిట్ టెస్టులు, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ప్రీ-ఫైనల్ పరీక్షలను కేంద్రీకృత పద్ధతిలో నిర్వహించారు. పరీక్షా ఫలితాలను డ్యాష్‌బోర్డ్‌ల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తూ, విద్యార్థుల మార్కుల ఆధారంగా టీచర్ల పనితీరును ప్రతి నెలా సమీక్షించారు. కళాశాల పని వేళలను ఉదయం 9:30 నుంచి 9 గంటలకు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు మార్చారు.





