రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఘనంగా నివాళులు అర్పించే కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కూడా అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులు అర్పించారు.
మల్లికార్జున్ నగర్ పరిధిలోని గౌతమ్ నగర్ డివిజన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, ఆయన సేవలను కొనియాడుతూ నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమానికి గౌతమ్ నగర్ డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు రాజేష్ ముఖ్యంగా హాజరై కార్యక్రమాన్ని ముందుండి నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ దేశానికి అందించిన రాజ్యాంగం వల్లే ప్రతి పౌరుడికి సమాన హక్కులు లభిస్తున్నాయని తెలిపారు. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ సెక్రటరీ బలరాం, మాజీ స్టేట్ ఎగ్జిక్టీవ్ సభ్యులు వాసంశెట్టి శ్రీనివాస్, గౌతమ్ నగర్ డివిజన్ అధ్యక్షుడు లక్షణ్ రావు తదితరులు పాల్గొన్నారు. వారు అంబేద్కర్ ఆశయాలను పాటిస్తూ సమానత్వ సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అదేవిధంగా నరసింహ చారి మరియు ఇతర నాయకులు కూడా కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్ సేవలను స్మరించారు. ఆయన చూపించిన మార్గంలో నడుస్తూ సమాజంలో ఉన్న అసమానతలను తొలగించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.






