భోగాపురం విమానాశ్రయానికి ఆర్టీసీ ఏసీ బస్సులు

Must read

భోగాపూర్​ ఇంటర్​నేషనల్​ ఎయిర్​పోర్ట్ ప్రారంభానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి ఎంతో కీలకంగా భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం చివరి దశలోకి చేరుకుంది. అధికారిక సమాచారం ప్రకారం ఇప్పటికే దాదాపు 98 శాతం పనులు పూర్తయ్యాయినట్లు తెలిపారు.

మిగిలిన పనులను కూడా వేగవంతంగా పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. జూన్ నెలాఖరు నాటికి అన్ని నిర్మాణ పనులు పూర్తిచేసి, జులై లేదా ఆగస్టు నెలలో విమానాశ్రయాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ విమానాశ్రయం ప్రారంభం ఉత్తరాంధ్ర ప్రాంతానికి గేమ్‌చేంజర్‌గా మారనుంది. ముఖ్యంగా విజయనగరం జిల్లా, విశాఖపట్నం పరిసర ప్రాంతాలకు అంతర్జాతీయ స్థాయి కనెక్టివిటీ అందుబాటులోకి రానుంది. వ్యాపారం, పర్యాటకం, పరిశ్రమల అభివృద్ధికి ఇది దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.

ఈ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఆంద్రప్రదేశ్​ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద మోడీను ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని ఆలోచన చేస్తుంది.ప్రధాని చేతుల మీదుగా ప్రారంభమైతే ఈ ప్రాజెక్ట్‌కు మరింత ప్రాధాన్యత లభిస్తుందని ప్రభుత్వం భావిస్తున్నారు.

ఈ విమానాశ్రయం ద్వారా దేశంలోని ప్రధాన నగరాలతో పాటు విదేశీ నగరాలకు కూడా నేరుగా విమాన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని, దీంతో ఐటీ, టూరిజం, ఎగుమతులు వంటి రంగాలు మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఈ ప్రాజెక్ట్ వల్ల స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని,నిర్మాణ దశలోనే వేలాది మందికి ఉపాధి కల్పించగా, ప్రారంభం తర్వాత కూడా వివిధ రంగాల్లో ఉద్యోగాలు లభించే అవకాశం ఉందన్నారు. హోటల్, ట్రావెల్, ట్రాన్స్‌పోర్ట్ వంటి అనుబంధ రంగాలు కూడా అభివృద్ధి చెందుతాయని ఈ సందర్భంగా వారు తెలిపారు.

ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను సమయానికి పూర్తి చేయడానికి ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటు చేసింది. పనుల నాణ్యతపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తోంది. భద్రత, సాంకేతిక ప్రమాణాలు అన్నింటినీ పాటిస్తూ విమానాశ్రయాన్ని అత్యాధునిక సౌకర్యాలతో రూపొందిస్తున్నారు.

మానాశ్రయ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించేందుకు జులై 5, 8 లేదా ఆగస్టు 17, 19 తేదీల్లో ఆయన సమయం కోరినట్టు తెలుస్తోంది. దీనిపై త్వరలో స్పష్టత రానుంది. ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముందే రవాణా సౌకర్యాలను సిద్ధం చేసేందుకు అన్ని శాఖలు సిద్ధమయ్యాయి.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!