నటి, ఫిల్మ్ మేకర్ రేణు దేశాయ్‌పై సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన మరో వ్యక్తిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, విశాఖపట్నంకు చెందిన ఇదాదాసు అప్పారావు అనే వ్యక్తి ఈ కేసులో నిందితుడిగా గుర్తించబడ్డాడు. ఇటీవల రేణు దేశాయ్‌కు సంబంధించిన ఒక వీడియోను సోషల్ మీడియా వేదిక
ఇన్స్ స్టాలో లో వీక్షించిన అతడు, ఆ తర్వాత ఒక నకిలీ ఖాతాను సృష్టించి దాని ద్వారా ఆమెపై అసభ్యకర చేశాడు.
ఈ ఘటనపై రేణు దేశాయ్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి,సాంకేతిక ఆధారాలు, ఐపీ అడ్రెస్లు, డిజిటల్ ట్రాకింగ్ వంటి పద్ధతులను వినియోగించి నిందితుడిని ప్రత్యేక బృందంతో కలిసి విశాఖపట్నంకు వెళ్లి అతడిని అదుపులోకి తీసుకున్నారు.
అరెస్ట్ చేసిన నిందితుడిని విచారణ కోసం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విచారణలో నిందితుడు తానే ఆ నకిలీ ఖాతాను సృష్టించి, అనుచిత వ్యాఖ్యలు పోస్టు చేసినట్లు అంగీకరించాడు
రేణు దేశాయ్‌పై ఆన్లైన్ వేధింపులకు సంబంధించి వారం రోజుల్లో ఇది రెండో అరెస్ట్. కొద్ది రోజుల క్రితమే గుంటూరుకు చెందిన మరో వ్యక్తిని కూడా ఇదే తరహాలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వరుస చర్యలు సోషల్ మీడియాలో బాధ్యతాయుత ప్రవర్తన అవసరాన్ని మరింతగా గుర్తుచేస్తున్నాయి.
సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలు సృష్టించడం, ఇతరులను కించపరచడం, అసభ్యకర వ్యాఖ్యలు చేయడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. ఇటీవల కాలంలో ప్రముఖులపై సోషల్ మీడియా వేదికల్లో అసభ్యకర వ్యాఖ్యలు పెరుగుతున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో ఇలాంటి వారిని వెంటవెంటనే అరెస్టు చేసి.. మహిళలకు మేమున్నమనే ధైర్యాన్ని పెంచుతున్నారు.





