తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి ఇవాళ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావుతో భేటీ కానున్నారు. ఈ సమావేశం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో జరగనుంది.
జీవన్ రెడ్డికి ఈ భేటీ కోసం ప్రత్యేకం. నిన్న కేటీఆర్ జీవన్ రెడ్డి ఇంట్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డిని మద్యాహ్న భోజనానికి ఆహ్వానం అందించినట్లు సమాచారం. ఈ సమావేశం కేవలం మర్యాదపూర్వకమైనదే కాకుండా, రాజకీయంగా కీలకమైనదిగా భావిస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్‌లో ఆయన చేరికపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని సమాచారం
తాజా రాజకీయ పరిణామాలపై విస్తృతంగా చర్చించనున్నట్టు సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య పెరుగుతున్న పోటీ, రాబోయే ఎన్నికల వ్యూహాలు, ప్రాంతీయ రాజకీయ సమీకరణాలపై ఈ సమావేశంలో చర్చలు జరిగే అవకాశముందని రాజకీయ వర్గాలు తెలుపుతున్నాయి.
జీవన్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు, పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతలు ఈ భేటీలో పాల్గొననున్నారని తెలిసింది.
వీరిలో కొప్పుల ఈశ్వర్, ఎల్. రమణ, దామోదర్ రావు, గంగుల కమలాకర్ వంటి ప్రముఖులు కూడా ఉండనున్నట్లు సమాచారం.
ఈ సమావేశం అనంతరం జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరే తేదీపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందని,
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసిన ఆయన, కొత్త రాజకీయ దిశలో అడుగులు వేయనున్నట్లు స్పష్టంగా కనబడుతుంది.
జీవన్ రెడ్డి వంటి సీనియర్ నేత బీఆర్ఎస్‌లో చేరితే, ఆ పార్టీకి ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బలం పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక పెద్ద దెబ్బ అని రాజకీయ విశ్లేషకులు తదితరులు వాపోతున్నారు.





