అంతరిక్షం నుంచి సూర్యగ్రహణం ఎలా కనిపిస్తుందంటే..

Must read

అంతరిక్షం నుంచి సూర్యగ్రహణాన్ని ఎలా కనిపిస్తుందో చూపించే అద్భుతమైన ఫొటోలు నాసా తాజాగా విడుదల చేసింది. ఈ ఫొటోలు తాజాగా పూర్తయిన ‘ఆర్టెమిస్-2’ మిషన్‌లో తీసినవి. భవిష్యత్తులో మానవులను చంద్రుడి ఉపరితలంపైకి పంపించేందుకు రూపొందించిన ఈ మిషన్, భూమి, చంద్రుడు, సూర్యగ్రహణ సమీకరణాన్ని అద్భుతంగా బంధించిందని నాసా వెల్లడించింది.

నాసా విడుదల చేసిన అంతరిక్ష సూర్యగ్రహణం ఫోటోను చూడగానే నెటిజన్లు హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాలోని గ్రాఫిక్స్‌ చూసినట్లు అభిప్రాయపడ్డారు. గ్రహణ సమయంలో భూమి అంచుల వెంబడి ప్రసరిస్తున్న కాంతి, మేఘాల మధ్య నుంచి కనపడుతున్న వివిధ రంగులు, భూమి నీడ (ఛాయ) పెద్ద నల్లటి మచ్చగా కదులుతున్న విధానం భిన్నమైన విజువల్ ను ఈ ఫోటోలో మనం చూడవచ్చు.

ఆర్టెమిస్-2 మిషన్ మానవులను చంద్రుడి చుట్టూ ప్రయాణించేలా సౌకర్యం కల్పిస్తుంది. వ్యోమగాములు ఈ ప్రయాణంలో భూమికి తిరిగి వస్తారు. మిషన్‌లో అమర్చిన అత్యాధునిక కెమెరాలు గ్రహణం ప్రతి అంశాన్ని నమోదు చేశాయి. ఈ ఫొటోలు కేవలం అందంగా ఉండటమే కాదు, శాస్త్రవేత్తలకు గ్రహణ సమయంలో భూ వాతావరణం, కాంతి ప్రసరణ, వాతావరణ మార్పులపై గణనీయమైన డేటాను అందిస్తుంది. దీంతో శాస్ర్తవేతలు కొత్త మార్పులను తెలుసుకున్నారు.

ఈ చిత్రాలు భవిష్యత్తులో భూమి-చంద్రుడు సంబంధిత అధ్యయనాలకు, అంతరిక్ష పరిశోధనలో కొత్త దిశలను
చూపుతాయని మానవుడు చంద్రుడిని పరిశీలించే ముందు, గ్రహణ సమయంలో కనిపించే ప్రకాశం, నీడల మార్పులను విశ్లేషించడం ఎంతో అవసరం ఉందని నాసా తెలిపింది.

ప్రస్తుతం ఈ ఫోటోలు నెటిజన్లలను ఆకట్టుకుంటున్నాయి. చాలా మంది “వాస్తవం కంటే సైన్స్ ఫిక్షన్ సినిమా తరహా” అని కామెంట్లు చేశారు. కొన్ని ఫొటోలు భూమి పై నుండి చూసినప్పటి కంటే భిన్నంగా, అంతరిక్ష దృశ్యాలపై కొత్త దృష్టిని ఇస్తున్నాయని పరిశోధకులు పేర్కొన్నారు.

‘ఆర్టెమిస్-2’ మిషన్ విజయం నాసా ప్రతిష్టను మరింత పెంచింది. భవిష్యత్తులో చంద్రుడి ఉపరితలంపై మానవుల ప్రయాణాన్ని సులభతరం చేయడానికి ఈ మిషన్ సాంకేతికంగా కీలకంగా నిలుస్తుంది. అంతరిక్ష పరిశోధనలో ఇది ఒక మైలురాయి.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!