కుత్బుల్లాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం

Must read

హైదరాబాదు పరిధిలోని కుత్బుల్లాపూర్‌లో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించి, ప్రాంతంలోని ఒక ప్లాస్టిక్, తుక్కు, రసాయనాల గోడాంలో మంటలు మొదలై, పక్కనే ఉన్న రెండంతస్తుల నివాస గృహానికి వ్యాపించడంతో పరిస్థితి గంభీరమైంది.

గోడాంలో అకాలంగా మంటలు ఎగసిపడటంతో మొదలయ్యాయి. . గోడాంలో ఉంచిన ప్లాస్టిక్, రసాయనాల కారణంగానే మంటలు వ్యాపించాయని.. స్థానికులు తెలిపారు. ఈ సమయంలోనే గాలి ఎక్కువగా ఉండడంతో మంటలుమరింత వేగంగా వ్యాప్తి చేందాయి. దీంతో పక్కనే ఉన్న ఇంటిని మంటలు చుట్టుముట్టాయి. ఒక్కసారిగా మంటలు ఇంట్లోకి ప్రవేశించడంతో కుటుంబ సభ్యులు ప్రాణభయంతో పరుగులు తీశారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, మూడు గంటలు ప్రయత్నించి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఈ క్రమంలో గోడాంలోని భవన నిర్మాణాలు, నిల్వ చేసిన వస్తువులకు భారీ నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు.

ఒక్కసారిగా మంటలు రావడంతో నివాస ప్రాంతం వాసులంతా భయాందోళనకు గురయ్యారు. అయితే, మంటలు మొదలైన కారణంపై ఇంకా పూర్తి నిర్ధారణ రాలేదు. గ్నిమాపక అధికారులు,పోలీస్ డిపార్ట్‌మెంట్ దర్యాప్తు చేసి నిజనిజాలు రాబట్టే అవకాశం ఉంది.

ఈ ఘటనతో మంటల ప్రమాదాల పట్ల ప్రజల్లో అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ప్లాస్టిక్, రసాయనాలు, ఇతర చెల్లింపు పదార్థాలను నిల్వ చేసే గోడాంలో భద్రతా నియమాలు పాటించకపోవడం వల్లే మంటలు వ్యాపిస్తున్నాయని, వేసవి కాలం కావడంతో మంటలు అతివేగంగా వ్యాపిస్తున్నాయని.. గోడాం నిర్వహకులు తగాన జాగ్రత్తలు తీసుకోవాలని, రసాయన పదర్థాలను ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోకూడదని అధికారులు సూచించారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!