ఏసీబీ వలకు చిక్కిన ఇద్దరు ఎయిర్ పోర్టు పోలీసులు

Must read

రాజీవ్​ గాంధీ అంపరిధిలోని పోలీస్ అవుట్‌పోస్ట్‌లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సంచలన దాడులు నిర్వహించారు. బుధవారం నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో లంచం తీసుకుంటూ ఉన్న ఇద్దరు పోలీస్ అధికారులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఏసీబీ అధికారులు అందించిన వివరాల ప్రకారం, ఒక కేసులో సహాయం చేస్తామని చెప్పి ఫిర్యాదుదారుడి నుంచి లంచం డిమాండ్ చేసిన ఇద్దరు అధికారులు పట్టుబడ్డారు. సంపత్​ కన్నకయ్య అనే ఇన్‌స్పెక్టర్, యు.కే. సిద్దేశ్వర్​ అనే సబ్-ఇన్‌స్పెక్టర్ కలిసి మొత్తం రూ.5 లక్షలు లంచం కోరినట్లు తేలిందన్నారు.

ఈ లంచాన్ని రెండు బాగాలుగా ఇవ్వాలని డిమాండ్​ చేశారు. రే. 2 లక్షలు
డ్వాన్స్‌గా స్వీకరిస్తుండగా, రంగారెడ్డి జిల్లా ఏసీబీ అధికారులు వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఆపరేషన్‌ను అత్యంత గోప్యంగా నిర్వహించామని ఏసీబీ అధికారులు, తెలిపారు. నిందితులిద్దరిని అరెస్ట్ రిమాండ్​ కు పంపించామన్నారు.

ఇన్‌స్పెక్టర్ కనకయ్య నివాసంలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీ మొత్తంలో నగదు బయటపడటం సంచలనం రేపింది. ఆయన ఇంటి నుంచి మొత్తం రూ.33.97 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అదనంగా పలు ఆస్తి పత్రాలు కూడా లభించాయని, వాటిపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.

విధులను దుర్వినియోగం చేసి అక్రమ లబ్ధి పొందినట్లు ఆరోపణలు రుజువవడంతో, ఇద్దరు అధికారులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో వారిని ప్రవేశపెట్టినట్లు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ వెల్లడించారు.

ఈ కేసులో ఫిర్యాదుదారుడి వివరాలను భద్రతా కారణాల దృష్ట్యా గోప్యంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు. అవినీతి వ్యతిరేక పోరాటంలో ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొంటూ, ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే వెంటనే టోల్-ఫ్రీ నంబర్ 1064కు సమాచారం ఇవ్వాలని ఏసీబీ అధికారులు విజ్ఞప్తి చేశారు.

రెండు రోజుల క్రితమే రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం అసోసియేట్ డీన్ గోవర్ధన్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సీడ్ లైసెన్సు కోసం రూ. 1 లక్ష లంచం తీసుకుంటూ ఆయన పట్టుబడ్డారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!