ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం మరో శుభవార్తను అందించింది. ప్రజల కోసం అందే ప్రధాన వైద్య సేవలలో ఒకటిగా గుర్తింపబడిన ‘ఎన్టీఆర్ వైద్య సేవ’ పథకం తిరిగి ప్రారంభమైనట్లు ప్రభుత్వం తెలిపింది.ఈ వార్త రాష్ర్ట ప్రజలకు ఊరట కలిగించింది. కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోయిన వైద్య సేవలు, ఆసుపత్రుల సమ్మె ప్రజలకు ఇబ్బందులకు గురిచేశాయి.
ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ (ఆషా) సమ్మెను విరమిస్తూన్నట్లు తెలిపింది. రాష్ట్రంలోని నెట్వర్క్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు మళ్లీ ప్రారంభమయ్యాయని. ‘ఆషా’ ప్రతినిధుల ప్రకటనలో తెలిపారు. రాష్ర్ట ప్రభుత్వం వారికి స్పష్టమైన హామీ ఇచ్చిందని అందువల్లే వారు సమ్మెను ముగించినట్లు తెలిపారు.
ప్రభుత్వం రూ.2,000 కోట్లు బకాయిలలో ఉన్నవాటిలో మొదటి దశలో రూ.1,000 కోట్ల చెల్లింపును 10 రోజులలో చేయడానికి ప్రభుత్వం అంగీకరించిందని. మిగిలిన రూ.1,000 కోట్లను రెండో విడతగా చెల్లిస్తామని హామీ ఇచ్చినట్లు ఆసుపత్రులు వెల్లడించాయి. ఈ హామీతో, ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా అందించబడే వైద్య సేవలు, చికిత్సలు యథావిధిగా కొనసాగుతాయని ఆసుప్రతుల అధికారులు తెలిపారు.
ముఖ్యంగా హార్ట్, ఆర్థో, న్యూరాలజీ, ఆంకాలజీ, జెనరల్ సర్జరీ వంటి విభాగాల వైద్య సేవలు పునరుద్దరించబడ్డాయని, ఈ సేవలు పేద, మధ్యతరగతి కుటుంబాల కోసం అత్యంత కీలకంగా ఉంటాయని వారు తెలిపారు. ప్రజలకు ఈ సేవలు తిరిగి అందుబాటులోకి రావడం ఒక పెద్ద ఉపశమనం అని వైద్య వర్గాలు పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వైద్యాసుపత్రులకు ఇచ్చిన హామీ, భవిష్యత్తులో బకాయిల సమస్యలు మళ్లీ రాకుండా చూసుకోవడం లక్ష్యంగా ఉండే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆషా ప్రతినిధుల సమ్మె విరమించడం ద్వారా పథకం ద్వారా అందే వైద్య సేవలు ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగుతాయని, ప్రతి రోగికి సమయానికి చికిత్స అందుబాటులో ఉంటుందని ప్రభుత్వ అధికారులు.. ఆషా ప్రతినిధులు తెలిపారు.
ఈ పునరుద్ధరణ ప్రజల నమ్మకాన్ని తిరిగి పొందడంలో సహాయపడుతుందని, ముఖ్యంగా పేద , మధ్య తరగతి వారు సెంట్రల్ హెల్త్ కేర్ మీద ఆధారపడిన వారు ఈ సేవలను ఉపయోగించుకుంటారని, నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కొనసాగుతుందని వారు తెలిపారు.





