ప్రియురాలి భర్తను హత్య చేసిన ప్రియుడు!

Must read

బెంగళూరులో వివాహేతర సంబంధం హత్యకు దారితీసింది. ఈ ఘటన సంచలనంగా మారింది. ప్రియురాలి భర్తను అడ్డు తొలగించుకోవాలనే దురుద్దేశంతో, అతడితో స్నేహం నటిస్తూ మందు పార్టీకి పిలిచి కిరాతకంగా హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది.

వివరాల ప్రకారం, బెంగళూరులోని ఒక మహిళకు వివాహేతర సంబంధం కొనసాగుతున్నది. విషయం తెలిసిన భర్త అమెను మందలించాడు. మహిళ మారక పోవడంతో కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన ప్రియుడు, భర్తను అంతమొందించాలని నిర్ణయించాడు.

నిందితుడు ముందుగా ప్రియురాలి భర్తతో స్నేహంగా ప్రవర్తించి, పాత గొడవలను మర్చిపోదామని నమ్మించాడు. తరువాత సరదాగా మద్యం సేవించడానికని బార్‌కు పలిచి మందు తాగించి, అతన్ని మత్తులో తీసుకెళ్లాడు..
బాధితుడు మద్యం మత్తులోకి జారిన తరువాత, నిందితుడు అతన్ని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్ళి హత్య చేశాడు. మృతదేహాన్ని సమీపంలోని చెత్తకుప్పలో పడేసి పరారయ్యాడు.

స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని. సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా,స్థానిక వివరాలతో
వివరాలను సేకరించి, నిందితుడి అదుపులోకి తీసుకుని విచారించగా, నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై బెంగళూరు పోలీస్లు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ హత్య వెనుక భార్య హస్తం ఏమైనా ఉందా అని పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు. భార్య ప్రేరేపించినట్లు తెలిస్తే ఆమెకు కూడా శిక్ష తప్పదని పోలీసులు హెచ్చరించారు.

తప్పుడు దారిలో వెళ్లే వారు ఇలాంటి దారుణాలకు ఒడిగట్టకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!