40 నిమిషాల పాటు చందమామ చాటున ఆర్టెమిస్

Must read

యావత్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అంతరిక్ష యాత్రలో అనూహ్య ఉద్రిక్తత నెలకొంది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చేపట్టిన అర్టెమిస్​-2 మిషన్‌లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. అంతరిక్షంలో ప్రయాణిస్తున్న ఓరియనవ్యోమనౌకతో భూమికి ఉన్న సంబంధాలు ఒక్కసారిగా తెగిపోవడం ఆందోళనకు గురిచేసింది.

సాధారణంగా అంతరిక్ష యాత్రల సమయంలో కొంతసేపు కమ్యూనికేషన్ అంతరాయం కలగడం సాధారణమే అయినప్పటికీ, ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. ఒకటి కాదు, రెండు కాదు… దాదాపు 40 నిమిషాల పాటు వ్యోమనౌక నుంచి ఎలాంటి సంకేతాలు అందకపోవడంతో నాసా బృందం తీవ్ర ఆందోళనకు గురైంది. ఈ సమయంలో అన్ని అత్యవసర ప్రోటోకాల్స్‌ను అమలు చేస్తూ, సమస్య ఏమిటో గుర్తించేందుకు వారు శ్రమించారు.

ఓరియన్ వ్యోమనౌక, చంద్రుడి కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది. ఈ ప్రయాణంలో భాగంగా వ్యోమనౌక చంద్రుడికి భూమి నుంచి కనిపించని అవతలి వైపునకు (ఫార్ సైడ్ ఆఫ్ ది మూన్) వెళ్ళింది. సరిగ్గా అప్పుడే, చంద్రుడు అడ్డుగా ఉండటంతో భూమిపై ఉన్న కంట్రోల్ సెంటర్‌కు, ఓరియన్‌కు మధ్య ఉన్న రేడియో సంబంధాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. లక్షల కిలోమీటర్ల దూరంలో, అపారమైన అంతరిక్షంలో ఒంటరిగా ప్రయాణిస్తున్న వ్యోమనౌక నుంచి ఎలాంటి సమాచారం లేని ఆ 40 నిమిషాలు నాసా శాస్త్రవేత్తలకు చెమటలు పట్టించాయి.

ఈ 40 నిమిషాల వ్యవధి నాసా బృందానికి ఒక పరీక్షగా మారింది. మిషన్ సురక్షితంగా కొనసాగుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తి ఉన్నవారు ఈ పరిణామాన్ని ఉత్కంఠగా గమనించారు.

అదే సమయంలో ఓరియన్ వ్యోమనౌక చంద్రుడి అవతలి వైపు నుంచి తిరిగి బయటకు వచ్చింది. వెంటనే, దాని నుంచి సిగ్నల్స్ తిరిగి భూమిని చేరాయి. దీంతో నాసా బృందం ఊపిరి పీల్చుకుంది. ఈ సంఘటన అంతరిక్ష యాత్రలలో ఎదురయ్యే సవాళ్లను మరోసారి గుర్తు చేసింది.

Artemis Program లో భాగమైన ఆర్టెమిస్-2 మిషన్ భవిష్యత్తులో మనుషులను చంద్రుడిపైకి పంపే లక్ష్యానికి కీలకమైన అడుగు. ఈ మిషన్ విజయవంతమైతే, చంద్రునిపై మానవ యాత్రలకు కొత్త దారులు తెరుచుకునే అవకాశముంది.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!