సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్‌లో ఘోర ఘటన చోటు చేసుకుంది. ప్రియుడితో వెళ్లిపోయిందనే అనుమానంతో ఓ వ్యక్తి తన భార్యను దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనతో ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి.
పోలీసుల సమాచారం ప్రకారం, జహీరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి తన భార్య ఇంటి నుంచి కనిపించకుండా పోయిందని ఇటీవల ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు మార్చి 30న పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మొదట ఈ కేసును సాధారణ మిస్సింగ్ కేసుగా భావించినప్పటికీ, విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
దర్యాప్తులో భాగంగా పోలీసులు భర్తను విచారించగా, అతని మాటల్లో అనుమానాస్పద అంశాలు బయటపడ్డాయి. చివరకు కఠినంగా ప్రశ్నించగా, భార్య ప్రియుడితో వెళ్లిపోయిందనే కోపంతో ఆమెను హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు సమాచారం. కుటుంబ విభేదాలు, అనుమానాలు ఎంతటి ప్రమాదకర పరిణామాలకు దారితీస్తాయో మరోసారి స్పష్టం చేసింది.
భార్యకు మాయమాటలు చెప్పి తన వద్దకు రప్పించి, అనంతరం గొంతు కోసి హత్య చేసినట్లు నిందితుడు పోలీసులకు తెలిపాడు. అనంతరం హత్యను దాచిపెట్టేందుకు ప్రయత్నించి భార్య ఎక్కడికో వెళ్లిపోయిందని మిస్సింగ్ కేసు నమోదు చేయించాడు. అనంతరం ఆధారాలను చెరిపివేయడానికి ప్రయత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
దీంతో అనుమానం వచ్చిన పోలీసులు వారి పద్దతిలో ఎంక్వైరీ చేయగా అసలు విషయన్ని తెలిజేశాడు నిందితుడు. భార్యకు వెరే వ్యక్తితో సంబంధం ఉందని అందుకే తానే తన భార్యను హత్య చేశానని పోలీసులకు వివరించడంతో పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు.





