- మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు
హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఆడిటోరియంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ (టి.ఎస్.పి.జె.ఏ) ఆధ్వర్యంలో ‘23వ ఉత్తమ ఫోటో జర్నలిస్ట్-2025 అవార్డుల ప్రధానోత్సవం’ ఘనంగా నిర్వహించబడింది.
భారత మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, “జర్నలిజం ఒక మహావృక్షమైతే, ఫోటో జర్నలిస్టులు ఆ వృక్షానికి ప్రాణం” అని అన్నారు. ఫొటో జర్నలిజం ప్రజాస్వామ్యానికి కళ్ల లాంటిదని, దీనిని కాపాడుకోవడం అందరికి బాధ్యతగా ఉండాలి అని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో ఫోటో జర్నలిస్టులు, మీడియా ప్రముఖులు, యువ కళాకారులు మరియు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అవార్డు వేడుక ద్వారా ఫోటో జర్నలిస్టుల పాత్రను గుర్తించి, వారి సేవలకు సత్కారం చేయడం ప్రధాన లక్ష్యం.
ఫొటో జర్నలిజం ద్వారా సంఘటనలను ప్రత్యక్షంగా చూపించడం, ప్రజలకు నిజాన్ని తెలియజేయడం సామాజిక బాధ్యతగా మారిందని ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ఈ అవార్డు కార్యక్రమం, యువతలో మీడియా రంగంలో నైపుణ్యాలను పెంపొందించడంలో ప్రేరణగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.
ఈ ఘనోత్సవం తెలంగాణ ఫోటో జర్నలిస్టుల కృషిని గుర్తించి, ప్రజాస్వామ్య వ్యవస్థలో వారి విలువను ప్రజల ముందు మరింత స్పష్టంగా ప్రతిపాదించింది. ఈ సందర్భంగా వారు ఫోటోగ్రఫీలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఫోటోజర్నలిస్టుల ప్రథమ బహుమతిని ఇందు శ్రీనివాస్(ఈనాడు, నిజామాబాద్), రెండవ బహుమతి ఎ.క్రిష్ణ (హాన్స్ ఇండియా, హైదరాబాద్), తృతీయ బహుమతి జి.బాలస్వామి (సాక్షి,హైదరాబాద్)లకు బహుమతులు అందజేశారు. అలాగే మరో పది మంది ఫొటో జర్నలిస్టులు ఎన్.రాజేష్ (సాక్షి,హైదరాబాద్),జి.శ్రీనివాస్ (నమస్తే తెలంగాణ, హైదరాబాద్), ఎ.జాన్ (సాక్షి,హైదరాబాద్),ఆర్.రాజు(సాక్షి,ఖమ్మం),పి.వాసప్రసాద్(సాక్షి,వరంగల్), ఎం.శ్రీనివాస్(ది హన్స్ ఇండియా,నల్లగొండ), జి.వేణుగోపాల్(సాక్షి,జనగాం),ఎం.అనిల్ కుమార్ (ఆంధజ్యోతి, హైదరాబాద్), వీరగోని.రాజనికాంత్ గౌడ్(నమస్తే తెలంగాణ,హైదరాబాద్), ఎ.జ్వల కోటేశ్వర్ రావు (ఆంద్రజ్యోతి, హైదరాబాద్), అందజేశారు.





